శుభవార్త! కువైట్ కు APNRT ప్రెసిడెంట్ రవి వేమూరు గారి పర్యటన... తెలుగు వారిని, మరియు వివిధ సంఘల వారితో అవగాహనా సదస్సులు... AP ప్రభుత్వం కొత్తగా ప్రవేశ పెట్టబోతున్న గల్ఫ్ ప్రవాసిల పాలసి పై...

Header Banner

శుభవార్త! కువైట్ కు APNRT ప్రెసిడెంట్ రవి వేమూరు గారి పర్యటన... తెలుగు వారిని, మరియు వివిధ సంఘల వారితో అవగాహనా సదస్సులు... AP ప్రభుత్వం కొత్తగా ప్రవేశ పెట్టబోతున్న గల్ఫ్ ప్రవాసిల పాలసి పై...

  Wed Jul 12, 2017 13:01        APNRT, Kuwait, Telugu

APNRT అనగా ఆంధ్ర ప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు. ఇది AP ప్రభుత్వ లోని ఒక సొసైటి. దీనిని విదేశాలలో ఉంటున్న ప్రతి AP తెలుగు వారి సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన ఒక సొసైటి (సంస్థ). విదేశాలలో ఉంటున్న ప్రతి తెలుగు వారు విధి గా ఈ సంస్థ లో సభ్యత్వం నమోదు చేసుకుంటే వారికి ఒక ID నెంబరు వస్తుంది. ఈ నెంబరు ఆధారం గా ఆపదల్లో ఉన్న వారికీ APNRT తగిన రీతిలో సహాయం చేయడానికి అవకాశం ఉంటుంది.

ఈ విషయం పై అవగాహన కల్పించడానికి దీని ప్రెసిడెంట్ శ్రీ రవి వేమూరు గారు కువైట్ కు 13 మరియు 14 న వస్తున్నారు. ఈ సందర్భం గా రవి గారు మరియు కువైట్ లో కో అర్దినేటర్స్ గా నియమించ బడ్డ 27 మంది కో అర్దినేటర్స్, కువైట్ లోని వివిధ ప్రాంతాలలో పర్యటించి తెలుగు వారి కి అవగాహనా సదస్సులు నిర్వహిస్తారు. ఈ అవగాహనా సదస్సుల్లో AP ప్రభుత్వం కొత్తగా ప్రవేశ పెట్టబోతున్న గల్ఫ్ ప్రవాసిల పాలసి పై అవగాహన దాని మూలం గా ఇక్కడ ఇబ్బందుల్లో ఉన్న వారికీ ఎవిదం గా ప్రభుత్వం తోడ్పాటునిస్తుంది అనే విషయమై వివరణలు ఉంటాయి.

సందర్సన వివరాలు:

13 వ తారీకు:  

ఎంబసీ పర్యటన... అంబాసిడర్ గారి తో చర్చలు...

ఫర్వానియ మరియు ఖైతాన్ లోని కొన్ని రెసిడెన్స్ అపార్ట్ మెంట్స్ సందర్శన

ఒక కంపెని క్యాంపు పర్యటన

కో అర్దినేటర్స్ కు అవగాహనా మరియు శిక్షణ కార్యక్రమం.

14 వ తారీకు: వివిధ ప్రాంతాల లో అవగాహనా సదస్సులు మరియు సభ్యత్వ నమోదు కార్యక్రమాలు.

సందర్సించు ప్రాంతాలు: అభు హలిఫా, ఖైతాన్ పార్క్, ఒమారియ పార్క్, కడప మసీదు, మాలియా లోని చెర్చిలు, ఫర్వానియ మరియు ఖైతాన్ లోని కొన్ని రెసిడెన్స్ అపార్ట్ మెంట్స్...

ఈ సందర్భం గా కువైట్ లో ఉన్న తెలుగు వారికి, మరియు వివిధ సంఘల వారు ఈ ప్రాంతాలలో మీ మీ సభ్యులతో తప్పక హాజరు కావాల్సింది గా  APNRT కో అర్దినేటర్స్ తరుపున ప్రార్ధన.

   శుభవార్త! కువైట్ కు APNRT ప్రెసిడెంట్ రవి వేమూరు గారి పర్యటన... తెలుగు వారిని, మరియు వివిధ సంఘల వారితో అవగాహనా సదస్సులు... AP ప్రభుత్వం కొత్తగా ప్రవేశ పెట్టబోతున్న గల్ఫ్ ప్రవాసిల పాలసి పై...