10 టీవీ లో ప్రసారం అయిన రవి ఉదంతం, APNRT కో అర్దినేటర్స్ వెంటనే స్పందన. ఎంబసిలో రక్షణ మరి 20 రోజులలో సొంత గూటికి ప్రయాణం...

Header Banner

10 టీవీ లో ప్రసారం అయిన రవి ఉదంతం, APNRT కో అర్దినేటర్స్ వెంటనే స్పందన. ఎంబసిలో రక్షణ మరి 20 రోజులలో సొంత గూటికి ప్రయాణం...

  Wed Jul 12, 2017 12:01        Helping Hand, Telugu, Kuwait, APNRT

నెల్లూరు జిల్లా కలువాయికి చెందిన రవి అనే వ్యక్తి  2011లో కువైట్‌కు వెళ్లాడు. సభ అల్ సాలెం అనే ఏరియా లో ఒక ఇరానీ కువైతి వద్ద కారు డ్రైవర్‌గా పని చేసిన అతడు.. 2016లో అక్కడి నుంచి తిరిగొచ్చాడు. ఇంకా కాసిన్ని అప్పులు ఉన్నా ఎలాగోలా ఇక్కడే తీర్చేయొచ్చనే ధైర్యంతో సొంతూరికి వచ్చేశాడు. అయితే కొద్ది నెలల తర్వాత మళ్లీ వస్తే రెండు లక్షల రూపాయలు ఇవ్వడంతోపాటు జీతం కూడా పెంచుతానని యజమాని ఫోన్ చేయడంతో అతడిలో కొత్త ఆశలు చిగురించాయి. మరో యేడాది పనిచేస్తే అప్పులన్నీ తీరిపోవడంతోపాటు కుటుంబం సంతోషంగా ఉంటుందని భావించాడు. భార్య, తల్లిదండ్రులకు నచ్చజెప్పి కువైట్‌కు వెళ్లాడు. 

అయితే గతంలోలాగా కాకుండా యజమాని ప్రవర్తనలో రవికి స్పష్టంగా మార్పు కనిపించింది. చిన్న చిన్న విషయాలకే కోప్పడటం, తిట్టడం చేస్తున్నాడను. అయినా తనపని తాను చేసుకుంటున్నాడు రవి. ఓ రోజు కారు పాడయిందని, దానికి రిపేర్ నువ్వే చేయించాలంటూ రవిని దూషించింది ఆ ఆడ ఇరానీ కువైట్ యజమాని. కొట్టి, ఓ స్టోర్ రూమ్‌లో పెట్టారు. తనను ఇంటికి పంపించేయాలని కోరితే.. చంపేస్తాం అని బెదిరిస్తున్నారని రవి వాపోయాడు. యజమాని ఉంచిన స్టోర్ రూమ్ నుంచే తన కష్టాలను చెప్పుకుని ఓ వీడియోను తీసి కుటుంబ సభ్యులకు పంపించాడు రవి.

నన్ను నాలుగు సార్లు కొట్టారు. కారు చెడిపోయిందని కొట్టారు. ఇంటికన్నా పంపించండి అని కోరితే చంపేస్తామంటున్నారు. నరికి ఇసుకలో పడేస్తామంటున్నారు. భోజనం తిని అయిదు రోజులయింది. పచ్చి మంచినీళ్లు కూడా ఇవ్వడం లేదు.  మా వాళ్లను చూడాలని ఉంది. నన్ను కాపాడండి. మీడియా, పోలీసులు తలచుకుంటే నన్ను కాపాడగలరు అని రవి ఆవేదన వ్యక్తం చేశాడు.

ఈ విడియో ను whats అప్ గ్రూప్ లో చుసిన సతీష్ అనే ప్రకాశం జిల్లా వాసి 10 టీవీ కి పంపగా దానిలో ప్రసారం చేసారు. ఈ విడియో చుసిన APNRT కో అర్దినటర్ శ్రీ కొత్తపల్లి రాం మోహన్ గారు తనవద్ద ఉన్న అన్ని కువైట్ లోని whats అప్ గ్రుప్ లకు పంపారు. దీనిలో భాగం గా కువైట్ ఎన్నారైస్ కు షేర్ చేసారు. అది ఇంతా 10 వ తేది రాత్రి జరిగింది. మరుసటి రోజు ఉదయాన్నే మరో APNRT కో ఆర్డినేటర్ శ్రీ మాలేపాటి సురేష్ బాబు నాయుడు గారు 10 టీవీ వారికీ ఫోన్ చేసి (ఫోన్ నంబర్ google లో సర్చ్ చేసి తెలుసుకున్నారు) రవి కుటుంబ సభ్యుల ఫోన్ నంబర్ తెలుసుకొవాదానికి ప్రయత్నించారు. ఈ లోపు శ్రీ కొత్తపల్లి రాం మొహన్ గారికి రవి నంబరు వివిధ మార్గాల ద్వార ప్రయత్నించగా దొరికింది.

(10 టీవీ లో ప్రసారమైన తరువాత చాల మంది అతని ఫోన్ నెంబర్ల కోసం కువైట్ నుండి చాల మంది ప్రయత్నించడం జరిగింది. ఈ సందర్భం గా టీవీ వాళ్ళు ఇలాంటి వార్తలు ప్రసారం చేస్తే వారి పూర్తి వివరాలు తెలిపితే వారి ఆచూకి వెంటనే తెలుసు కోవడాని కి అవకాశం ఉంటుందని అభిప్రాయ పడ్డారు.)

 

ఈ నంబరు కువైట్ ఎన్నారైస్ అధినేత మరియు APNRT మిడిల్ ఈస్ట్ మీడియా కో అర్దినటర్ చప్పిడి రాజ శేఖర్ గారికి ఇవ్వగా ఒకే కారులో APNRT ప్రెసిడెంట్ శ్రీ రవి వేమూరి గారి కువైట్ పర్యటన పనులలో (ఈ నెల 13 మరియు 14 తేదిలలో కువైట్ పర్యటిస్తున్నారు) ఉన్న సురేష్ మరియు రాజ శేఖర్ గార్లు రవి తో మాట్లాడటం జరిగింది. అప్పటికే అతను తన కువైట్ స్పాన్సర్ ఇంటినుండి పారిపోయి ఎంబసీ కి వచ్చి కంప్లైంట్ ఇచ్చి తన స్నేహితుడు ఒకే ఉరి వాడు అయిన శ్రీ సుబ్బా రెడ్డి సహాయం తో టాక్సీ లో బైలుదేరి వెళుతున్నారు. సురేష్ మరియు రాజ శేఖర్ తిరిగి అతనిని ఎంబసీ కి రమ్మనగా వెంటనే తిరిగి వచ్చారు. అతను రాగానే సంభదిత అధికారులను కలిసి వెంటనే అతని స్పాన్సర్ కు ఫోన్ చేపించడం జరిగింది.

అధికారులకు ఆ ఇరానీ కువైట్ స్పాన్సర్ అతను తమకు ఎంతో నష్టం చేకుర్చాడని, తప్ప తాగి కారు నడిపేవాడని ఆ అధికారికి తెలిపింది. దానికి మీ వద్ద సాక్షం ఉందా అని అడుగ గా ఉంది అని బుకించారు. ఆ అధికారి మీరు ఇలా చేస్తే మిమ్మల్ని బ్లాక్ లిస్టు లో పెడతాము ఒక సారి బ్లాక్ లిస్టు లో పెడితే ఇక పై మీరు ఏ భారతీయుడిని తీసుకు రాలేరని తెలుపగా మాకేమి వద్దు మీ మనషులు మేము అతని మిద పోలీస్ కంప్లయింట్ మాత్రం తప్పక చేస్తాము చేసిన తరువాత అతని పాస్పోర్ట్ ఎంబసీ కి ఇస్తాము అని తెలిపారు. అది 5 రోజులలో.

అతని పాస్ పోర్ట్ రాగానే ఎంబసీ అధికారులు అతనికి అవుట్ పాస్ చేసి పంపుతారు.. ఈ తతంగం మొత్తం పూర్తి అవడానికి కనీసం 15 లేదా 20 రోజులు పడుతుంది. ఈ తతంగం అంతా ముగిసే వరకు  కువైట్ ఎంబసీలో రక్షణ లో అతను ఉంటారు. తరువాత ఏపీఎన్నార్టీ ద్వార అతనిని సొంతూరికి పంపడం జరుగుతుంది.

ఎంబసీ లో పనులు పూర్తి ఐన తరువాత సురేష్ బాబు మరియు రాజ శేఖర్ రవిని ఎంబసీ షెల్టర్ లో తమ కారు లో దింపి ఏమైనా కావసిన సహాయం ఉంటె తప్పక చేస్తాము అని బరోసా ఇచ్చారు.


   10 టీవీ లో ప్రసారం అయిన రవి ఉదంతం, APNRT కో అర్దినేటర్స్ వెంటనే స్పందన. ఎంబసిలో రక్షణ మరి 20 రోజులలో సొంత గూటికి ప్రయాణం