మళ్లీ పెళ్లి చేసుకుంటానన్న అమలా పాల్

Header Banner

మళ్లీ పెళ్లి చేసుకుంటానన్న అమలా పాల్

  Thu Jun 15, 2017 21:58        Cinemas, India, Telugu

అమలా పాల్.. తెలుగువారికి పరిచయం చేయనక్కర్లేదు ఈ మలయాళీ హీరోయిన్ ని. కెరీర్ ఆరంభంలో తెలుగునాట బ్రహ్మాండమైన క్రేజ్ ను కలిగి ఉండేదీమె. కొన్నిసినిమాలు చేసినా సరైన హిట్స్ లేక వెనుకబడిపోయింది. తమిళంలో మాత్రం అమల రాణించింది. కొన్ని హిట్ సినిమాలతో గుర్తింపు సంపాదించుకుంది. అదే క్రమంలో అమల సినీ దర్శకుడు విజయ్ ని వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత కూడా కెరీర్ ను కొనసాగిస్తానని అప్పట్లో అమల ప్రకటించింది.

 

అయితే అతి తక్కువ కాలంలోనే అమల వివాహం విడాకులకు దారి తీసింది. భర్త, భర్త కుటుంబంతో విబేధాలతో ఈమె వేరుపడింది. అతి తక్కువ కాలంలోనే వైవాహిక జీవితాన్ని ముగిసిపోవడంతో ఈమెపై చాలా మంది సానుభూతి చూపారు. అయ్యో పాపం... అనుకున్నారు. అయితే అమల మాత్రం తనకు ఎవరి సానుభూతీ అవసరం లేదని స్పష్టం చేస్తోంది. తనకు ఇంకా బోలెడంత జీవితం ఉందని విశ్వాసం వ్యక్తం చేస్తోంది.ఏదో పెళ్లి పెటాకులు అయ్యిందని తను సన్యాసం తీసుకోవడం లేదని అమల వ్యాఖ్యానించింది. తను మళ్లీ పెళ్లి చేసుకుంటాను అని స్పష్టం చేసింది. అది కూడా ప్రేమించే పెళ్లి చేసుకుంటానని కూడా స్పష్టం చేసింది. సన్యాసం తీసుకుని హిమాలయాలకు వెళ్లిపోను, పెళ్లి చేసుకుని సంసార జీవితంలోకి అడుగు పెడతాను అని అమల నొక్కి చెప్పింది.

 

 

 

మరి విజయ్ కాదనుకున్నంత మాత్రానా, విడాకులు తీసుకున్నంత మాత్రానా..తనలో ఆత్మవిశ్వాసం అనువంతైనా తగ్గలేదని అమల ఈ విధంగా స్పష్టం చేస్తోంది. ఆనందంగా బతకడానికి ఈ స్పిరిటే కదా కావాలి!

 


   మళ్లీ పెళ్లి చేసుకుంటానన్న అమలా పాల్