కువైట్ కు తల్లితండ్రులను తీసుకురావాలంటే స్పాన్సర్ జీతం కనీసం KD 1000 ఉంటేనే... రెసిడెన్స్ ఛార్జ్ KD 300, హెల్త్ ఇన్సూరెన్స్ KD 200

Header Banner

కువైట్ కు తల్లితండ్రులను తీసుకురావాలంటే స్పాన్సర్ జీతం కనీసం KD 1000 ఉంటేనే... రెసిడెన్స్ ఛార్జ్ KD 300, హెల్త్ ఇన్సూరెన్స్ KD 200

  Thu Jun 15, 2017 15:30        Kuwait, Telugu

కువైట్ కు తల్లితండ్రులను తీసుకురావాలంటే స్పాన్సర్ జీతం కనీసం KD 1000 ఉంటేనే... రెసిడెన్స్ ఛార్జ్ KD 300, హెల్త్ ఇన్సూరెన్స్ KD 200

కువైట్ లో వీసా ఆర్టికల్ 22 పై ప్రవాసిల తల్లితండ్రులు/ అన్నలు/ తమ్ముళ్ళు/ అక్కలు/ చెల్లెళ్ళు/ మనవళ్ళు/ మనవరాళ్ళు మొత్తం 11,500 ఉన్నట్లు, వీరందరి రెసిడెన్స్ రెన్యువల్ మానవత్వ దృష్టితో రెన్యు చేసుకోవచ్చని జనరల్ డిపార్ట్మెంట్ ఫర్ రెసిడెన్స్ అఫైర్స్ తెలిపింది.

కాకపోతే వీరి రెసిడెన్స్ రెన్యువల్స్ ఇప్పుడు వున్నసంవత్సరానికి 50 దినార్లు హెల్త్ ఇన్సూరెన్స్ కి బదులు 200 దినర్లకు కట్టవలసి ఉంటుంది.

అలాగే భంధువులను తెచ్చుకునే ప్రవాసిల కనీసం జీతం 1000 దినార్లు గా సవరించిన డ్రాఫ్ట్ ను మినిస్ట్రీ అఫ్ ఇంటిరియర్ అప్రూవల్ కోసం పంపింది.

అదే విధం గా ఈ డ్రాఫ్ట్ లో మరికొన్ని సూచనలు కుడా చేసింది. వాటి వివరాలు చుస్తే రెసిడెన్స్ ఫీజు 200 దినార్లు నుండి 300 దినార్లు కు, అదే విధం గా హెల్త్ ఇన్సూరెన్స్ 50 దినార్ల నుండి 200 దినర్లకు పెంచుతూ సూచనలు చేసింది.

ఈ డ్రాఫ్ట్ సూచనలు అప్రువ్ అయ్యేంతవరకు గత నెల లో ప్రకటించిన నిషేధ ఆజ్ఞలు అమలులోనే ఉంటాయి. అనగా ప్రవాసుల భంధువుల రెసిడెన్స్ రెన్యువల్ కావు, కొత్త వీసాలు ఇవ్వరు.

   కువైట్ కు తల్లితండ్రులను తీసుకురావాలంటే స్పాన్సర్ జీతం కనీసం KD 1000 ఉంటేనే... రెసిడెన్స్ ఛార్జ్ KD 300, హెల్త్ ఇన్సూరెన్స్ KD 200