కువైట్ లో ఈద్ సెలవలు 5 రోజులా లేక 9 రోజులా? రెండు రకాల అవకాశాలు చంద్ర దర్శనం పై ఆధారం...

Header Banner

కువైట్ లో ఈద్ సెలవలు 5 రోజులా లేక 9 రోజులా? రెండు రకాల అవకాశాలు చంద్ర దర్శనం పై ఆధారం...

  Thu Jun 15, 2017 07:30        Kuwait, Telugu

కువైట్ లో ఈద్ సెలవలు 5 రోజులా లేక 9 రోజులా? రెండు రకాల అవకాశాలు చంద్ర దర్శనం పై ఆధారం...

కువైట్ కాబినెట్ మంత్రి షేక్ మహమ్మద్ అల్ అబ్దుల్లా ఒక ప్రకటనలో కువైట్ లో ఈద్ సెలవులపై ఒక ప్రకటన చేసారు. వివరాల లోకి వెళితే, ఈద్ మొదటి రోజు ఆదివారం అనగా జూన్ 25 న కానీ అయితే 25, 26, 27, తో పాటు వారాంతపు సెలవులు 23, 24 తో కలుపుకొని మొత్తం 5 రోజులు సెలవు అవుతుంది. అనగా 23 నుండి 27 జూన్ వరకు. తిరిగి పని రోజు 28 జూన్ న మొదలవుతుంది.

అదే ఈద్ మొదటి రోజు సోమవారం అనగా 26 న కానీ అయితే సెలవులు మొత్తం 9 రోజులు అవుతాయి. అంటే ఆదివారం అనగా 25 జూన్ మరియు గురువారం 29 జూన్ న కుడా రెస్ట్ డే గా ప్రకటిస్తారు. అప్పుడు 23 జూన్ నుండి 1 జూలై వరకు అంటే ముందు 2 రోజులు చివరి 2 రోజుల వారాంతపు సెలవలను కలుపుకొని మొత్తం 9 రోజులు సెలవులు అవుతాయి. తిరిగి పని రోజు (వర్కింగ్ డే) 2 జూలై న మొదలవుతుంది. ఈ సెలవులు ప్రభుత్వ రంగం వరకే పరిమితం. ప్రేవేట్ కంపెనీ లలో పని చేసేవారికి వర్తించవు. ఆ సెలవులు ఆయా కంపనిల యాజమాన్యాల పై ఆధార పడి ఉంటాయి.

   కువైట్ లో ఈద్ సెలవలు 5 రోజులా లేక 9 రోజులా? రెండు రకాల అవకాశాలు చంద్ర దర్శనం పై ఆధారం...