మహారాష్ట్రలో 'మొదటిసారి' గెలిచిన బీజేపీ..

Header Banner

మహారాష్ట్రలో 'మొదటిసారి' గెలిచిన బీజేపీ..

  Fri Apr 21, 2017 22:56        India, Telugu

ఐదేళ్లుగా వరుస కరవుతో అల్లాడుతున్న లాతూర్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ విజయబావుటా ఎగురవేసింది. బీజేపీని గెలుపుతీరాలకు తీసుకు వెళ్లడం ద్వారా మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ మరోసారి తన సత్తా చాటుకున్నారు. 70 సీట్ల మున్సిపల్ కార్పొరేషన్‌‌‌కు జరిగిన ఎన్నికల్లో బీజేపీ 36 సీట్లు కైవసం చేసుకోగా, కాంగ్రెస్ 33 సీట్లకే పరమితమైంది. స్వాంతంత్ర్య వచ్చినప్పటి నుంచి లాతూర్ మున్సిపాలిటీని కాంగ్రెస్ నిలబెట్టుకుంటోంది. ఐదేళ్ల క్రితం జరిగిన గత ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ 50 సీట్లు గెలుచుకోగా, బీజేపీకి ఒక్క సీటు కూడా దక్కలేదు. గత బుధవారంనాడు లాతూర్ ఎన్నికలు జరిగాయి. గెలుపును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ముఖ్యమంత్రి ఫడ్నవిస్ విస్తృత ప్రచారం సాగించడంతో పాటు బీజేపీకి ఓటు వేస్తే లాతూర్‌ను కరవురహితంగా తీర్చిదిద్దుతామని గట్టి హామీ ఇచ్చారు. అందుకు తగ్గట్టే శుక్రవారంనాడు లూతూర్ మున్సిపాలిటీని బీజేపీ దక్కించుకోవడంతో పాటు తొలిసారి కాంగ్రెస్ కంచుకోటను బద్దలుకొట్టిన క్రెడిట్‌ను సొంతం చేసుకుంది.
 


   మహారాష్ట్రలో 'మొదటిసారి' గెలిచిన బీజేపీ..