'అద్వానీ రెచ్చగొట్టలేదు...నేనే ఆ పనిచేశా'

Header Banner

'అద్వానీ రెచ్చగొట్టలేదు...నేనే ఆ పనిచేశా'

  Fri Apr 21, 2017 22:47        India, Telugu

అయోధ్యలోని వివాదాస్పద బాబ్రీ మసీదు కట్టడాన్ని కూల్చడానికి కరసేవకులను రెచ్చగొట్టింది ఎల్.కె.అద్వానీ కాదని, తానే ఆ పని చేశానని బీజేపీ మాజీ ఎంపీ రామ్ విలాస్ వేదాంతి శుక్రవారం సంచలన ప్రకటన చేశారు. బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో ఎల్.కె.అద్వానీ సహా పలువురిపై ఉన్న కుట్ర అభియోగాలను పునరుద్ధరిస్తూ రెండ్రోజుల క్రితం సుప్రీంకోర్టు తీర్చు చెప్పిన నేపథ్యంలో రామ్ విలాస్ వేదాంతి తాజా ప్రకటన చేశారు. నాటి ఘటనను ఆయన గుర్తు చేసుకుంటూ, మసీదును కూల్చి ఆ స్థలంలో రామాలయం కట్టాలనే పట్టుదలతో కరసేవకులు కట్టడాన్ని చుట్టుముట్టారని, ఆ సమయంలో వీహెచ్‌పీ నేత అశోక్ సింఘాల్, మహంత్ అవైద్యనాథ్‌తో తాను కలిసి ఉన్నానని, కరసేవకులను ప్రస్తుతిస్తూ తాను వారిని రెచ్చగొట్టానని వేదాంతి తెలిపారు. మురళీ మనోహర్ జోషి, అద్వానీ, విజయరాజె సింధియా మాత్రం కరసేవకులను శాంతపరిచి పరిస్థితిని చక్కదిద్దెందుకు ప్రయత్నించారని వెల్లడించారు. బాబ్రీ మసీదు కుట్రదారులుగా సీబీఐ పేర్కొన్న 13 మందిలో వేదాంతి పేరు కూడా ఉంది.   'అద్వానీ రెచ్చగొట్టలేదు...నేనే ఆ పనిచేశా'