బాహుబలి 2 రిలీజ్ వేళ... ఫ్రీ ఆఫర్లే ఆఫర్లు!

Header Banner

బాహుబలి 2 రిలీజ్ వేళ... ఫ్రీ ఆఫర్లే ఆఫర్లు!

  Fri Apr 21, 2017 21:36        Cinemas, Telugu

బాహుబలి 2 రిలీజ్ వేళ సినిమా టిక్కెట్ల కొనుగోలు రూపంలో జేబుకు చిల్లు పడుతుందని అంతా భావిస్తున్న తరుణంలో..... ఓ ఫ్రీ ఆఫర్ అందరినీ ఆశ్చర్య పరిచింది. 'బాహుబలి' చిత్రంతో ఎయిర్‌టెల్‌ టై అప్ అయింది. ఇందులో భాగంగా బాహుబలి ఎయిర్ టెల్ సిమ్ ఆఫర్ ప్రకటించారు. Baahubali 2: The Conclusion: మీ టికెట్స్ ను వెంటనే బుక్ చేసుకోండి! ఆఫర్ వివరాల్లోకి వెళితే... బాహుబలి సిమ్‌ కొంటే ఉచిత 4జీ డేటా, బాహుబలి రీఛార్జ్‌ ప్యాక్‌ లభించనున్నాయి. ఈ విషయాన్ని ఎయిర్‌టెల్‌ ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సీఈవో వెంకటేశ్‌ విజయరాఘవన్‌ ప్రకటించారు. బంజారాహిల్స్ లో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రభాస్‌, రాజమౌళి, అనుష్క తదితరులు పాల్గొన్నారు.

బాహుబలి ‘బాహుబలి: ది కన్‌క్లూజన్‌' సెన్సార్‌ పూర్తయిందని, యూ/ఏ సర్టిఫికేట్‌ వచ్చిందని నిర్మాతలు అఫీషియల్ గా ప్రకటించారు. ఇండియాలో ఈ చిత్రం దాదాపు 7 వేలకు స్క్రీన్లలో విడుదల కాబోతోంది.

2.47 గంటల నిడివి బాహుబలి-‘ది కంక్లూజన్' నిడివి 2 గంటల 47 నిమిషాలు ఉంటుందని నిర్మాతలు ప్రకటించారు. అత్యధికంగా ఐమాక్స్ స్క్రీన్లలో విడుదలవుతున్న తొలి ఇండియన్ సినిమా కూడా ఇదే.

కట్టప్ప దిగొచ్చాడు: కన్నడ ప్రజలకు లేఖ, బాహుబలికి లైన్ క్లియర్ బాహుబలి 2 సినిమా విడుదలపై కర్నాటకలో కొనసాగుతున్న వివాదం ముగిసింది. కట్టప్ప పాత్రధారి సత్యరాజ్ క్షమాపణ కోరుతూ లేఖ రాసారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
వావ్... ఎంత అద్భుతంగా ఉందో (బాహుబలి 2 సాండ్ ఆర్ట్ వీడియో) ముంబైకి చెందిన ఫేమస్ శాండ్ ఆర్టిస్ట్ శర్వం పటేల్ బాహుబలి 2 ట్రైలర్ ను శాండ్ ఆర్ట్ రూపంలో ప్రజెంట్ చేయ‌డం అంద‌రినీ ఆక‌ట్టుకుంటోంది. వీడియో కోసం క్లిక్ చేయండి.

   offers-for-bahubali2