రేషన్ దుకాణంలో అగ్నిప్రమాదం 14 మంది మృతి, పలువురికి గాయాలు

Header Banner

రేషన్ దుకాణంలో అగ్నిప్రమాదం 14 మంది మృతి, పలువురికి గాయాలు

  Fri Apr 21, 2017 21:30        India, Telugu

మధ్యప్రదేశ్ లో ఘోరం జరిగింది. రేషన్ షాపులో అగ్నిప్రమాదం చోటుచేసుకొని 14 మంది మృతి చెందారు. పలువురు గాయపడ్డారు.

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని చింద్వారా జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకొంది. చింద్వారా జిల్లాలోని బాంగ్రీ గ్రామంలోని రేషన్ దుకాణంలో ఈ ప్రమాదం చోటుచేసుకొంది. రేషన్ దుకాణంలో కిరోసిన్ పంపిణీ చేస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకొంది.ఈ ప్రమాదంలో 14 మంది అగ్నికి ఆహుతయ్యారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో చనిపోయిన వారికి మధ్యప్రదేశ్ ప్రభుత్వం నాలుగు లక్షలను ఎక్స్ గ్రేషియాగా ప్రకటించింది.
   fire-acident