మందు, విందు... నాగ చైతన్య, సమంత పార్టీ ఫోటోస్ వైరల్!

Header Banner

మందు, విందు... నాగ చైతన్య, సమంత పార్టీ ఫోటోస్ వైరల్!

  Fri Apr 21, 2017 21:22        Cinemas, Telugu

నాగ చైతన్య, సమంత త్వరలో భార్య భర్తలు కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ జంటకు నిశ్చితార్థం అయింది కాబట్టి సగం పెళ్లి అయినట్లే. ప్రస్తుతం ఇద్దరూ కలిసే ఉంటున్నారు. ఎవరి సినిమాల్లో వారి బిజీగా ఉంటూనే ఇద్దరికీ సమయం దొరికినప్పుడల్లా ఫ్రెండ్స్, పార్టీల్లో మునిగి తేలుతూ ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా సమంత, నాగ చైతన్యకు సంబంధించిన కొన్ని ఫోటోలు ఇంటర్నెట్ లో వైరల్ అయ్యాయి. తమ స్నేహితులతో కలిసి పార్టీ చేసుకుంటున్న ఫోటోస్ లీక్ అయ్యాయి. ఈ ఫోటోల్లో నాగ చైతన్య మందులోకి మంచింగ్ గా స్నాక్స్ ప్రిపేర్ చేస్తూ కనిపించడం విశేషం.

నాగ చైతన్య, సమంత నాగ చైతన్య, సమంత ఫ్రెండ్స్ తో కలిసి పార్టీలో మునిగి తేలుతున్న ఫోటో ఇదే. నాగ చైతన్య స్నాక్స్ ప్రిపేర్ చేస్తున్న దృశ్యాన్ని ఈ ఫోటోలో చూడొచ్చు.

చైతుకి హెల్ప్ చేస్తూ... నాగ చైతన్య స్నాక్స్ ప్రిపేర్ చేస్తుంటే.... పక్కనే ఉండి అతడికి హెల్ప్ చేస్తున్న సమంత. ఇద్దరి మధ్య ఎంత అండర్ స్టాండింగ్ ఉందో ఈ ఫోటో చూసి అర్థం చేసుకోవచ్చు.

జాయ్ ఫుల్ పార్టీ తమ స్నేహితులు, సన్నిహితులతో కలిసి అలా సరదాగా గడిపుతూ నాగ చైతన్య, సమంత రిలాక్స్ అయిన ఈ ఫోటోలు ఇపుడు షోల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

పెళ్లి ఎప్పుడు నాగ చైతన్య, సమంత వివాహం ఎప్పుడు? అనే విషయమై ఇప్పటి వరకు సరైన క్లారిటీ లేదు. అయితే వీరి వివాహం అక్టోబర్ లో జరిగే అవకాశం ఉందని అంటున్నారు.

   samantha-chaithanya-understanding