కువైట్ లో ప్రవాసాంధ్ర తెలుగు దేశం కువైట్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు – రాబోయే ఎన్నికలకు సమాయత్తం కావాలని పిలుపు.

Header Banner

కువైట్ లో ప్రవాసాంధ్ర తెలుగు దేశం కువైట్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు – రాబోయే ఎన్నికలకు సమాయత్తం కావాలని పిలుపు.

  Fri Apr 21, 2017 21:17        Associations, Telugu, Kuwait

కువైట్ లో ప్రవాసాంధ్ర తెలుగు దేశం కువైట్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు – రాబోయే ఎన్నికలకు సమాయత్తం కావాలని పిలుపు.  

ప్రవాసాంధ్ర తెలుగు దేశం కువైట్ ఆధ్వర్యంలో, నందమూరి , నారా, పరిటాల అభిమానుల సమక్షంలో  నవ్యాంధ్ర నిర్మాణ సమితి ఐటి విప్లవ ఆద్యులు, నవ భగీరధుడు, నిత్య యవ్వనుడు, ఆంధ్రా రాజధాని రూపకర్త మన ప్రియతమ ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన వేడుకలను కువైట్ ఫర్వానియా Nesto బిల్డింగ్ లో ఘనంగా నిర్వహించారు.  ఈ వేడుకలకి 100 మందికి పైచిలుకు తెలుగు దేశం అభిమానులు, పలు తెలుగు దేశం అసోసియేషన్స్, నవ్యాంధ్ర తెలుగు దేశం, ఆంధ్ర సేవా సమితి, దూదేకుల సంఘం, మనకడప సేవ సమితి, ఆంధ్ర  ముస్లిం  అసోసియేషన్ సభ్యులు హాజరయ్యారు.

కార్యక్రమం సాయంత్రం 8.00 నిముషములకు ప్రారంభం అయి పుట్టినరోజు కేక్ కట్ చేయడం, మరియు చంద్రబాబుగారికి ఇష్టం అయిన శాఖాహారం పసందయిన వంటల విందుతో ముగిసింది.

ఈ వేడుకల సందర్భంగా పలువురు తెలుగు దేశం అభిమానుల తో పాటు గా ప్రసాంధ్ర తెలుగుదేశం కువైట్ కమిటీ సభ్యులు, నవ్యాంధ్ర తెలుగు దేశం, ఆంధ్ర సేవాసమితి, ఆంధ్ర దూదేకుల సంఘం, మనకడప సేవ సమితి, ఆంధ్ర  ముస్లిం  అసోసియేషన్ సభ్యులు అభిమానులు  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి రాజకీయ జీవితం అంచెలంచెలుగా ఎదిగిన వైనం గురించి స్పురణకి తెచ్చుకుంటూ ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భం గా ప్రవాసాంధ్ర తెలుగు దేశం వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకట్ కోడూరి గారు ఇప్పటి నుండే ఎన్నికల సమర సంఖారవన్ని పూరిస్తూ ప్రతిఒక్కరు రాబోయే ఎన్నికలకు సమయతం కావాలని ప్రవాసాంధ్ర తెలుగు దేశం కువైట్ తరుపునుండి  పిలుపునివ్వడం విశేషం.

అలాగే NRI ల కోసం APNRT ని స్తాపించటం, గల్ఫ్ లో ఉన్న ఆంధ్ర వారికీ APNRT గల్ఫ్ పాలసి గురించి వచ్చిన వారికీ  వివరించటం జరిగింది.

అలాగే ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలను సమూలంగా మార్చివేసి, పరిపాలనా రంగానికి హైటెక్ సొగసులద్దిన చంద్రబాబు నాయుడును అందరూ హైటెక్ ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తారని పలువురు ప్రశంసించారు. . చంద్రబాబు నాయుడు ప్రవేశంతో పరిపాలనా విధానంలో వేగం పెరిగింది అని చంద్రబాబు నాయుడు గారిని అభినందిస్తూ చంద్రబాబు నాయుడు గారు  సంపూర్ణ ఆయురారోగ్యఐశ్వర్యాలతో  కలకాలం జీవించాలని ఆకాంక్షిస్తూ వేడుకలని ముగించారు.

ఈ సందర్భంగా ప్రవాసాంధ్ర తెలుగు దేశం పార్టీ కువైట్, నారా, నందమూరి, పరిటాల అభిమానులకు అభినందనలు తెలియజేసుకుంటూ ,  ఆంధ్రా రాజధాని రూపకర్త మన ప్రియతమ ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి కువైట్ ఎన్నారైస్ హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.


   చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు