మోడీ, కెసిఆర్ లు రహస్య స్నేహితులు: దిగ్విజయ్ సింగ్

Header Banner

మోడీ, కెసిఆర్ లు రహస్య స్నేహితులు: దిగ్విజయ్ సింగ్

  Fri Apr 21, 2017 21:15        India, Telugu

ప్రధానమంత్రి నరేంద్రమోడీ, తెలంగాణ సీఎం కేసీఆర్ ల మధ్య రహస్య స్నేహం నడుస్తోందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జ్ దిగ్విజయ్ సింగ్ చెప్పారు.

శుక్రవారం నాడు ఆయన హైద్రాబాద్ లో పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రిజర్వేషన్ల పేరుతో ఇరువర్గాలను రెచ్చగొట్టి బీజేపీ, టిఆర్ఎస్ లబ్దిపొందాలని చూస్తోందన్నారు.

కాంగ్రెస్ పార్టీ గలీజ్ పార్టీ ఎలా అయిందో చెప్పాలని ఆయన కేటీఆర్ ను కోరారు.టిఆర్ఎస్ ఏ రకమైన పార్టీ అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ గలీజ్ పార్టీగా మారిందా అని ఆయన ప్రశ్నించారు.

టీపీసీసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పనితీరుపై హైకమాండ్ సంతృప్తిగా ఉందని దిగ్విజయ్ చెప్పారు.పార్టీని బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు.

 


   modi-kcr-friend