టిఆర్ఎస్ లో సంస్థాగతంగా భారీ మార్పులు, ఇక విమర్శిస్తే కేసులే:కెసిఆర్

Header Banner

టిఆర్ఎస్ లో సంస్థాగతంగా భారీ మార్పులు, ఇక విమర్శిస్తే కేసులే:కెసిఆర్

  Fri Apr 21, 2017 21:08        India, Telugu

తెలంగాణలో అధికారంలో ఉన్న టిఆర్ఎస్ సంస్థాగత మార్పులకు చోటుచేసుకొన్నాయి. ఈ మేరకు టిఆర్ఎస్ ప్లీనరీ సంస్థాగత మార్పులను ప్రకటించింది ఆ పార్టీ. జిల్లా కమిటీలను పూర్తిగా రద్దు చేసింది టిఆర్ఎస్.

టిఆర్ఎస్ సంస్థాగత మార్పులకు శ్రీకారం చుట్టింది. రెండేళ్ళకు ఓసారి జరిగే పార్టీ అధ్యక్ష ఎన్నికలను నాలుగేళ్ళకు ఓసారి జరపాలని నిర్ణయం తీసుకొన్నారు.

ప్రస్తుతం జిల్లా కమిటీలు కొనసాగుతున్నాయి.అయితే జిల్లా కమిటీలను పూర్తిగా రద్దు చేశారు. జిల్లా కమిటీల స్థానంలో నియోజకవర్గ కమిటీలను ఏర్పాటు చేయనున్నారు.

సంస్థాగత మార్పుల ద్వారా పార్టీని మరింత బలోపేతం చేయాలని సంస్థాగత మార్పులకు శ్రీకారం చుట్టింది పార్టీ.ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేసే వారిపై కఠినంగా వ్యవహరించాలని పార్టీ నిర్ణయం తీసుకొంది.

సంస్థాగత మార్పులకు టిఆర్ఎస్ శ్రీకారం

సంస్థాగత మార్పులకు టిఆర్ఎస్ శ్రీకారం చుట్టింది. సంస్థాగత నిబంధనల్లో భారీ మార్పులకు శ్రీకారం చుట్టింది. ఇప్పటివరకు రెండేళ్ళకు ఓసారి రాష్ట్ర అధ్యక్షుడిని ఎన్నిక జరుగుతోంది. ఇకపై ఆ కాలపరిమితిని నాలుగేళ్ళకు పెంచారు.జిల్లా కమిటీలను పూర్తిగా రద్దు చేశారు. ఇక జిల్లా కమిటీల బదులు అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి కమిటీలు మాత్రమే కొనసాగుతాయి.ఈ కమిటీల కాలపరిమితి కూడ నాలుగేళ్ళ పాటు కొనసాగుతాయి.టిఆర్ఎస్ ప్లీనరీలో ఈ మేరకు నిర్ణయం తీసుకొన్నారు.

ప్రభుత్వంపై విమర్శలు చేస్తే కేసులు

ప్రభుత్వంపై గుడ్డిగా విమర్శలు చేస్తే కేసులు పెడతామని ముఖ్యమంత్రి కెసిఆర్ చెరప్పారు. ప్రభుత్వంపై అనవసర విమర్శలు చేస్తే కేసులు తప్పదని ఆయన చెప్పారు.గత ప్రభుత్వాలే అవినీతిని పెంచిపోషించాయి. గత ప్రభుత్వాల అవినీతిపై యుద్దంపై చేస్తున్నట్టు కెసిఆర్ చెప్పారు.

కల్తీ విత్తనాలు విక్రయిస్తే చర్యలు

రైతులకు కల్తీవిత్తనాలు అమ్మేవారిపై కఠిన చర్యలు తీసుకొంటామని ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటించారు. రైతులు ఎంత నష్టపోతే అంత మొత్తాన్ని కల్తీ విత్తనాలు అమ్మేవారిపై కఠినచర్యలు తీసుకొంటామని కెసిఆర్ ప్రకటించారు. ఈ మేరకు రైతాంగానికి అనుకూలంగా చట్టాన్ని రూపొందించనున్నట్టు ప్రకటించారు.

పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైన కెసిఆర్

టిఆర్ఎస్ ప్లీనరీ ప్రారంభ సమయంలో కెసిఆర్ మరోసారి పార్టీ అద్యక్షుడుగా ఎన్నికయ్యారని ఎన్నికల రిటర్నింగ్ అధికారి నాయిని నర్సింహ్మారెడ్డి ప్రకటించారు.కెసిఆర్ మరోసారి పార్టీ అద్యక్షుడుగా ఎన్నికయ్యారని ప్రకటించగానే ప్లీనరీకి హజరైన ప్రతినిదులు పెద్దఎత్తున హర్షధ్వానాలు చేశారు.వరుసగా ఎనిమిదోసారి కెసిఆర్ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.ఈ నెల 27వ, తేదిన వరంగల్ లో జరిగే సభకు హజరుకావాలని కెసిఆర్ కోరారు.


   trs-kcr