కువైట్ లో తెలుగు దేశం కువైట్ ఆధ్యర్యంలో ఘనంగా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు

Header Banner

కువైట్ లో తెలుగు దేశం కువైట్ ఆధ్యర్యంలో ఘనంగా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు

  Fri Apr 21, 2017 16:27        Associations, Telugu, Kuwait

కువైట్ లో ఘనంగా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు

కువైట్ లోని SVS Cargo ఆఫీసు ప్రాంగణంలో తెలుగుదేశం జాతీయ అధ్యక్షులు మరియు నవ్యాంధ్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి 68వ జన్మదిన వేడుకలను తెలుగు దేశం -కువైట్ అధ్యక్షులు కుదరవల్లి సుధాకర్ రావు గారి ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈకార్యక్రమం లో ప్రసంగించిన తెలుగుదేశం-కువైట్ అధ్యక్షులు కుదరవల్లి సుధాకరరావు గారు ntr ఆదర్శంగా మరియు చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తి తో కువైట్ లో  పలు సేవా   కార్యక్రమాలు చేపడుతున్నామని,  మన రాష్ట్రం  కనీసం రాజధాని కూడా లేకుండా విడిపోతే చంద్రబాబు గారి పరిపాలన చాతుర్యంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలపడానికి ఆయన చేస్తున్న కృషి మరువలేనిదని తెలిపారు.

 


అలాగే  ఇంద్రాణి ఛారిటబుల్ ట్రస్ట్ అధినేత ఇంద్ర కుమార్ రాజు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి గా మన అదృష్టం అని ఆయన రాష్ట్రాన్ని చరిత్ర పుటల్లో అగ్రస్థానంలో  నిలుపుతారని2019 లో కూడా  ఆయననే ముఖ్యమంత్రి గా  చేయడానికి మనందరం కృషి చేయాలని వచ్చిన సభ్యులను కోరారు. ఈ కార్యక్రమం లో ప్రవాస కాపు బలిజ సేవా సంఘం అధ్యక్షులు మరియు తెలుగు కువైట్ వెల్ఫేర్ కో.ఆర్డినేటర్ మురళి  గారు   మరియు  P.R.Oఈశ్వర్ నాయుడు  మరియు మీడియా కో ఆర్డినేటర్ రవికుమార్ మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను వివరించారు.
ఈ కార్యక్రమం లో గల్ఫ్ వైడ్ నందమూరి ఫ్యాన్స్ అధ్యక్షులు వేగి వెంకటేష్ మరియు నారా లోకేష్ సేవా సమితి అధ్యక్షులు పట్టాభిరామ మరియు ఆంధ్రాయూత్ కార్యవర్గ సభ్యులు మరియు తెలుగు దేశం కువైట్ సభ్యులు  సుబ్బారెడ్డి,ముస్తాక్,విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు

    chandra babu naidu birthday in kuwait