అనంతపురం: చంద్రబాబుకు చేదు అనుభవం, మరోసారి నోరుజారిన లోకేష్

Header Banner

అనంతపురం: చంద్రబాబుకు చేదు అనుభవం, మరోసారి నోరుజారిన లోకేష్

  Thu Apr 20, 2017 22:17        India, Telugu

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు చేదు అనుభవం ఎదురైంది. అయితే చంద్రబాబునాయుడు తనయుడు లోకేష్ కూడ గురువారం నాడు అనంతపురం జిల్లాలో పర్యటించారు. అయితే మరోసారి లోకేష్ నోరు జారాడు.అనంతపురం జిల్లాలో ఇద్దరు వేర్వేరు కార్యక్రమాల్లో ఈ ఘటనలు చోటుచేసుకొన్నాయి. చంద్రబాబునాయుడు అనంతపురం జిల్లాలో గురువారం నాడు పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.నీరు, ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్న బాబుకు చేదు అనుభవం ఎదురైంది. నీరు ప్రగతి కార్యక్రమంపై ప్రభుత్వం చేస్తున్న ప్రచారంపై ఓ రైతు ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ కార్యక్రమం వల్ల ప్రయోజనం లేదని రైతు ఎదురుదాడికి దిగారు. దీంతో బాబుకు ఏం చెప్పాలో తోచని పరిస్థితి నెలకొంది

అయితే అనంతపురం జిల్లాలో పాల్గొన్న లోకేష్ కూడ మరోసారి నోరు జారాడు. తండ్రికి చేదు అనుభవం ఎదురైతే, లోకేష్ మరోసారి అలవాటులో పొరపాటుగా మాట్లాడాడు. లోకేష్ ఎప్పుడు ఏం మాట్లాడుతారోననే చర్చ సాగుతోంది.

చంద్రబాబుకు చేదు అనుభవం నీరు ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు చేదు అనుభవం ఎదురైంది.ఇంకుడు గుంతల గురించి గొప్పలు చెప్పాడు చంద్రబాబునాయుడు. అయితే ఇంకుడు గుంతల వల్ల తమకు ఎలాంటి ప్రయోజనం లేదని టిడిపి నాయకుడే చెప్పడంతో బాబు ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొన్నారు.

7 లక్షలను ఖర్చు పెట్టినా ప్రయోజనం లేదు ఇంకుడు గుంతలకు రూ.7 లక్షల రూపాయాల ఖర్చు పెట్టానని , తమకు ఎలాంటి ప్రయోజనం కలగలేదని ఆవేదన వ్యక్తం చేశారు టీడిపి నాయకుడు, రైతు రామ్మోహన్ చౌదరి చెప్పారు.ఇంకుడు గుంతల గురించి చంద్రబాబు గొప్పలు చెబుతున్న సమయంలోనే స్వంత పార్టీకి చెందిన నాయకుడు ఇలా మాట్లాడేసరికి షాకయ్యారు బాబు. ఊహించని పరిణామంతో బిత్తరపోయిన చంద్రబాబు జవాబు దాటవేశారు.

మరోసారి నోరుజారిన లోకేష్ మంత్రిగా బాధ్యతలను చేపట్టిన తర్వాత లోకేష్ ప్రసంగంలో ఏదో తప్పు దొర్లుతోంది. అయితే ఈ తప్పులను ప్రత్యర్థులు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు.అయితే మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత అనంతపురం జిల్లాలో తొలిసారిగా గురువారం నాడు పర్యటించారు.ఇటీవల కాలంలో ఆయన నోరుజారిన ఘటనలు చోటుచేసుకొన్నాయి.అయితే ప్రసంగాల్లో ఈ రకంగా నోరుజారడం సాధారణమే.

లోకేష్ ఏమన్నాడంటే ఇటీవల జరిగిన అంబేద్కర్ జయంతి సందర్భంగా తూర్పుగోదావరి జిల్లాలో తాగునీటి సమస్య ఏర్పాటే తమ లక్ష్యమన్నారు. ఇప్పుడు ఆ రెండింటిని మించిపోయేలా మరో గొప్ప మాట అన్నారు.వచ్చే ఎన్నికల్లో టిడిపిని రాష్ట్రంలోని 200 అసెంబ్లీ స్థానాల్లో గెలిపించాలని ఆయన కార్యకర్తలను కోరారు.ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రస్తుతం 175 స్థానాలే. అలాంటప్పుడు 200 స్థానాల్లో ఎలా గెలిపించాలని అర్థం కాక కార్యకర్తలు గుసగుసలాడుకొన్నారు.

   lokesh-cm-bad-cituation