ప్రతి కుటుంబానికి నెలకు రూ.10వేల ఆదాయమే లక్ష్యం : చంద్రబాబు

Header Banner

ప్రతి కుటుంబానికి నెలకు రూ.10వేల ఆదాయమే లక్ష్యం : చంద్రబాబు

  Wed Apr 19, 2017 22:41        అమరావతి కబుర్లు, India, Telugu

ప్రతి కుటుంబానికి నెలకు రూ.10వేల ఆదాయం కల్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని సీఎం చంద్రబాబునాయుడు తెలిపారు. రాగ్‌పికర్స్‌ ఎంపవర్‌మెంట్‌ ప్రోగ్రాం పుస్తకాన్ని చంద్రబాబు ఆవిష్కరించారు. మెప్మా రూపకల్పన చేసిన పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈసందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. వీధిబాలలకు విద్య, ఆరోగ్యం, సాధికారత, గౌరవప్రదమైన జీవన విధానం అంశాలపై పుస్తకం రాశారన్నారు. పేదరికం లేని సమాజ సృష్టి కోసం పనిచేస్తున్నామన్నారు. వీధిబాలలకు కౌన్సెలింగ్‌ ద్వారా చదువు నేర్పించాలన్నారు. భవిష్యత్‌లో వారు గౌరవప్రదంగా జీవించేలా చేస్తామన్నారు.

    ప్రతి కుటుంబానికి నెలకు రూ.10వేల ఆదాయమే లక్ష్యం : చంద్రబాబు