మహాభారతంలో మహేష్ బాబు

Header Banner

మహాభారతంలో మహేష్ బాబు

  Wed Apr 19, 2017 22:22        Cinemas, India, Telugu

వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ప్రస్తుతం నడుస్తున్న టాపిక్ ఇదే. వెయ్యి కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ప్రముఖ వ్యాపారవేత్త బీఆర్ షెట్టి… ది మహాభారత అనే సినిమాను రూపొందించనున్న విషయం తెలిసిందే. ఈ మెగా ప్రాజెక్టును మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ స్వయంగా వెల్లడించారు. ఇప్పుడీ ప్రాజెక్టులోకి మహేష్ బాబును తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నారట.
 
ది మహాభారత ప్రాజెక్టులో భీష్ముడి పాత్ర కోసం మోహన్ లాల్ ను అనుకున్నారు. ఇక మహేష్ బాబును కృష్ణుడి పాత్ర కోసం సంప్రదించారట. అటు బాలీవుడ్ లో ఇదే పాత్ర కోసం హృతిక్ రోషన్ ను కూడా సంప్రదించారట. ఇద్దర్లో ఎవరు ఒప్పుకుంటే వాళ్లతోనే కృష్ణుడి పాత్ర వేయించాలని చూస్తున్నారు. ఒకవేళ ఇద్దరూ ఒప్పుకుంటే… భాషలకు తగ్గట్టు వాళ్లతోనే వేర్వేరుగా షూట్ చేయాలని అనుకుంటున్నార.
 
అయితే రీమేక్ సినిమాలకు, పౌరాణిక-చారిత్రక పాత్రలకు మహేష్ చాలా దూరమనే విషయం మనకు తెలిసిందే. ఇప్పటికే అలాంటి కొన్ని ఆఫర్లను మహేష్ బాబు రిజెక్ట్ చేశాడు. ఈ నేపథ్యంలో.. ది మహాభారత ప్రాజెక్టును మహేష్ అంగీకరిస్తాడా అనేది పెద్దప్రశ్న. చరిత్రలో నిలిచిపోయే సినిమాలో తను కూడా ఓ భాగం కావాలనుకుంటే మహేష్ కచ్చితంగా ఒప్పుకుంటాడు. లేదంటే లైట్ తీసుకుంటాడు


   మహాభారతంలో మహేష్ బాబు