గల్ఫ్ సినిమా మీడియా అంబాసిడర్ గా శ్రీ చప్పిడి రాజశేఖర్ గారు

Header Banner

గల్ఫ్ సినిమా మీడియా అంబాసిడర్ గా శ్రీ చప్పిడి రాజశేఖర్ గారు

  Wed Apr 19, 2017 21:39        India, Kuwait, Telugu

గల్ఫ్ లో ఉన్న పాతిక లక్షల మంది తెలుగువారు ఉపాధికోసం ఎడారి బాట పట్టినవాళ్ళు .. వారి జీవితాలపై రీసెర్చ్ చేసి శ్రావ్య ఫిలిమ్స్ బ్యానర్ పై తెరకెక్కిన గల్ఫ్ సినిమా. ఇందుకోసం గల్ఫ్ దేశాలకు వారిని కలిసి.. వాళ్ళు అక్కడ ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు..వారు అలాంటి పరిస్థితుల్లో ఉంటూ తమ కుటుంబ సభ్యులకు డబ్బు పంపిస్తూ ఉంటారు. ఇక్కడ వాళ్ళ కుటుంబాలు ఎలా ఉన్నాయి? ఇవన్నీ నిర్మాత అధ్యయనం చేయడం జరిగింది. అంతే కాదు.. చాలా ఊళ్ళల్లో 40% మంది ఉపాథి కోసం గల్ఫ్ బాట పడుతూ ఉంటారు . వాళ్ళు తమ కుటుంబాలకు డబ్బు పంపడం.. కుటుంబాలకు అండగా నిలవడం ఇవన్నీ నిర్మాత  దగ్గరనుండి చూసి ఈ సినిమా తీయడం జరిగింది.  ఇదొక యదార్థ జీవితాలకి సంబంధించిన కథల ఆధారంగా తీసిన సినిమా.

ఈ సినిమాకి మీడియా అంబాసిడర్ గా గుంటూరు నివాసి, కువైట్ లో గత 20 ఏళ్లుగా నివాసం ఉంటున్న  సంచలన అంతర్జాల పత్రిక అయిన  కువైట్ ఎన్నారైస్ డైరెక్టర్ మరియు ఎపి ఎన్నార్టీ మిడిల్ ఈస్ట్ మీడియా కో ఆర్డినేటర్, ఎన్నారై  శ్రీ చప్పిడి రాజ శేఖర్ గారిని నియమించారు. గల్ఫ్ సినిమా గురించి ప్రొమోషన్, తదితర సంబంధిత విషయాలకు  శ్రీ చప్పిడి రాజ శేఖర్ గారు అంబాసిడర్ గా వ్యవహరిస్తారని శ్రావ్య ఫిలిమ్స్ బ్యానర్ పై తెరకెక్కిన గల్ఫ్ సినిమా నిర్మాత మరియు డైరెక్టర్ అయిన శ్రీ సునీల్ కుమార్ రెడ్డి గారు తెలిపారు.

ఈ సందర్భంగా  కువైట్ ఎన్నారైస్ డైరెక్టర్ మరియు ఎపి ఎన్నార్టీ మిడిల్ ఈస్ట్ మీడియా కో ఆర్డినేటర్, ఎన్నారై  శ్రీ చప్పిడి రాజ శేఖర్ గారు గల్ఫ్ సినిమా నిర్మాత మరియు డైరెక్టర్ అయిన శ్రీ సునీల్ కుమార్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేసారు. .


   గల్ఫ్ సినిమా మీడియా అంబాసిడర్ గా శ్రీ చప్పిడి రాజశేఖర్ గారు