ప్రభాస్ ఫ్యాన్స్‌కు శుభవార్త.. అదిరిపోయే న్యూస్.. 23న పండుగే పండుగ..

Header Banner

ప్రభాస్ ఫ్యాన్స్‌కు శుభవార్త.. అదిరిపోయే న్యూస్.. 23న పండుగే పండుగ..

  Wed Apr 19, 2017 20:46        Cinemas, Telugu

'బాహుబలి' ప్రభాస్‌ అభిమానులకు శుభవార్త. బాహుబలి2 సినిమాతోపాటు ఫ్యాన్స్ డబుల్ ధమాకా రానున్నది. బాహుబలి2 తర్వాత ప్రభాస్ నటిస్తున్న సినిమా టీజర్ ఈ నెల (ఏప్రిల్) 23న విడుదల కానున్నది. ఈ చిత్రానికి సాహో అని పేరు పెట్టినట్టు ప్రచారం జరుగుతున్నది. సుజిత్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ ఈ చిత్రం ప్రభాస్ కెరీర్‌లో 19వది. ఈ టీజర్‌ను బాహుబలి ది కన్‌క్లూజన్‌తోపాటు ప్రదర్శించనున్నారు.

ఏడాది క్రితం గ్రీన్ సిగ్నల్ ఏడాది క్రితం సుజిత్ రెడ్డి దర్శకత్వంలో నటించడానికి ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. బాహుబలి2 సినిమా షూటింగ్ పూర్తికాగానే ఈ చిత్ర షూటింగ్‌ను మొదలుపెట్టారు. అయితే వాస్తవానికి ఈ సినిమా అంతకుముందే ప్రారంభమైందని, ఫస్ట్‌లుక్‌ను, టీజర్‌ను విడుదల చేసి అభిమానులను ఆశ్చర్యపరుచాలని దర్శకుడు సుజిత్ నిర్ణయించినట్టు సమాచారం.

23న టీజర్, ఫస్ట్‌లుక్ సుజిత్ డైరెక్షన్‌లో వచ్చే ఈ చిత్రం నాలుగు భాషల్లో రూపొందుతున్నది. తెలుగు, తమిళ, హిందీ, మలయాళ ప్రేక్షకులకు అందించేందుకు ప్రయత్నిస్తున్నాం. ప్రభాస్ 19వ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను ఏప్రిల్ 23న విడుదల చేయనున్నాం. ఈ సినిమా టైటిల్‌ను, పోస్టర్‌ను ఏప్రిల్ 23న ప్రకటిస్తాం. బాహుబలి2 సినిమాతోపాటు నాలుగు భాషల్లో టీజర్‌ను విడుదల చేస్తాం అని దర్శకుడు సుజిత్ తెలిపాడు.

రెండేళ్లుగా వెయిటింగ్.. ప్రభాస్‌తో సినిమా కోసం గత రెండేళ్లుగా ఎదురుచూస్తున్నాను. టీజర్ కోసం పనిచేయడం ఒక సినిమా కోసం కంటే ఎక్కువ శ్రమించినంత పనవుతున్నది. టీజర్‌కు ముంబైలో తుది మెరుగులు దిద్దుతున్నాం అని సుజిత్ రెడ్డి వెల్లడించారు. టీజర్ అభిమానులకు కొత్త అనుభూతిని పంచుతుందనే ధీమాను సుజిత్ వ్యక్తం చేశాడు.

150 కోట్ల బడ్జెట్ ప్రభాస్ 19వ చిత్రం యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై సుమారు రూ.150 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా బడ్జెట్‌లో ఎక్కువ భాగం స్టంట్లు, యాక్షన్ సీన్ల కోసం ఖర్చుపెడుతున్నాం. ఈ సినిమాలో అనేక కమర్షియల్ హంగులు ఉన్నాయి. ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగించే కొత్త పాయింట్ ఈ చిత్రంలో ఉన్నది అని సుజిత్ తెలిపాడు.

   goodnews-to-prabhas-fans