కేశినేనికి చంద్ర‌బాబు చెక్‌పెడుతున్నారా..?

Header Banner

కేశినేనికి చంద్ర‌బాబు చెక్‌పెడుతున్నారా..?

  Fri Apr 14, 2017 21:42        అమరావతి కబుర్లు, India, Telugu

విజ‌య‌వాడ రాజ‌కీయాల్లో ఇవాళ సీఎం చంద్ర‌బాబు మాజీ ఎంపీ ల‌గ‌డ‌పాటి క‌ల‌యిక చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఎంపీ కేశినేని నానికి చెక్ పెట్టేందుకే మాజీ ఎంపీ ల‌గ‌డ‌పాటిని చంద్ర‌బాబు ఎంచుకున్నారా...? కాగా ఇవాళ మాజీ ఎంపీ ల‌గ‌డ‌పాటి సీఎం చంద్ర‌బాబును క‌లిసిన విష‌యం తెలిసిందే. ఈనేప‌ధ్యంలో చంద్ర‌బాబును క‌లిసిన త‌ర్వాత మీడియాతో ల‌గ‌డ‌పాటి మాట్లాడుతూ... సీఎం చంద్ర‌బాబును మ‌ర్యాద‌పూర్వ‌కంగానే క‌లిశానంటూ తెలిపారు. ఇటీవ‌లే చంద్ర‌బాబుపై త‌ర‌చూ ఎంపీ కేశినేని నాని అసంతృప్తిని వ్య‌క్తం చేస్తున్న విష‌యం తెలిసిందే. కేశినేని నాని అల‌క స‌మ‌యంలోనే మాజీ ఎంపీ ల‌గ‌డ‌పాటి చంద్ర‌బాబును క‌లిశారు. ఈ నేప‌ధ్యంలో ఇటీవ‌లే చంద్ర‌బాబును ల‌గ‌డ‌పాటి పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తారు. 2019 విజ‌య‌వాడ ఎంపీ సీటు మాజీ ఎంపీ ల‌గ‌డ‌పాటికేనా....?            
   కేశినేనికి చంద్ర‌బాబు చెక్‌పెడుతున్నారా..?