అతిపెద్ద బాంబు: ఐసిస్‌కు పెద్ద దెబ్బ, 'ట్రంప్! పాక్‌లోను దాడి చేయండి'

Header Banner

అతిపెద్ద బాంబు: ఐసిస్‌కు పెద్ద దెబ్బ, 'ట్రంప్! పాక్‌లోను దాడి చేయండి'

  Fri Apr 14, 2017 20:55        Telugu, World

ఆఫ్గానిస్థాన్‌లోని ఐసిస్ (ఇస్లామిక్ స్టేట్) స్థావరంపై అమెరికా జరిపిన అతిపెద్ద బాంబు దాడిలో 36 మంది ఉగ్రవాదులు మృతి చెందినట్లు ఆప్గనిస్తాన్ రక్షణ శాఖ తెలిపింది. ఈ దాడిలో ఉగ్రవాదులకు చెందిన మూడు భూగర్భ సొరంగాలు, భారీ ఎత్తున ఆయుధాలు, మందుగుండు సామాగ్రి ధ్వంసమయ్యాయని చెప్పింది. అయితే సామాన్య పౌరులకు ఎలాంటి హానీ జరగలేదని తెలిపింది. ఆప్గనిస్తాన్‌లో అమెరికా అతిపెద్ద బాంబు దాడి, ఐసిస్ టార్గెట్‌గా పాక్ సరిహద్దుల్లో.. ఆఫ్గాన్‌-పాక్‌ సరిహద్దుల్లో గల నాన్‌గర్హర్‌ ప్రావిన్స్‌లోని అచిన్‌ జిల్లాలో అమెరికా ఈ దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. జిల్లాలోని టనెల్‌ సముదాయంపై మదర్‌ ఆఫ్‌ ఆల్‌ బాంబ్స్‌గా పిలిచే 21,600 పౌండ్ల బరువుగల జీజీయూ-43/బి బాంబును గురువారం రాత్రి జార విడిచింది. తొలిసారిగా దీన్ని ఓ యుద్ధంలో ప్రయోగించారు.

అణు రహిత మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్ అమెరికా జారవిడిచిన ఈ బాంబును మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్‌గా పిలుస్తారు. ఉగ్రవాదులే లక్ష్యంగా ఈ అణు రహిత బాంబును ప్రయోగించింది. ఐసిస్ టెర్రరిస్టుల ప్రాబల్యం ఎక్కువగా ఉండే తూర్పు ఆప్ఘానిస్థాన్‌లోని నంగర్హార్‌లో ఈ బాంబును జార విడిచారు.

ఇలా జార విడిచింది ఎంసీ-130 అనే విమానం నుంచి జీబీయూ-43 అనే ఈ బాంబును అమెరికా ప్రయోగించింది. నంగర్హార్‌ ప్రావిన్స్‌లోని అచిన్‌ జిల్లాలో ఉన్న ఐసిస్‌ టన్నెల్‌ కాంప్లెక్స్‌‌పై జీబీయూ-43/బీ బాంబును అఫ్ఘానిస్థాన్‌లోని అమెరికా బలగాలు ప్రయోగించాయి స్థానిక కాలమానం ప్రకారం రాత్రి ఏడున్నర గంటలకు ఈ దాడి జరిగింది.

ఈ బాంబు ప్రభావం ఎంత అంటే.. యుద్ధం లేని సమయంలో అమెరికా ఈ స్థాయి బాంబును ప్రయోగించడం ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేసింది. దాదాపు 10 టన్నుల బరువైన ఈ బాంబు ప్రభావం వల్ల 300 చదరపు మీటర్ల ప్రాంతం పూర్తిగా కాలిపోయి, బూడిద అవుతుంది. దాదాపు 4 చ.కి.మీ. మేర ఈ బాంబు ప్రభావం ఉంటుందని తెలుస్తోంది.

పాక్‌లోను దాడి చేయండి.. ట్రంప్‌కు విజ్ఞప్తి పాకిస్థాన్‌లో దాగి ఉన్న ఉగ్రవాద సంస్థల పైనా దాడులు చేయాలని అమెరికాకు చెందిన ప్రముఖ మాజీ దౌత్యవేత్త జల్మయ్‌ ఖలీల్ జాద్‌ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ను కోరారు. ట్రంప్‌ యంత్రాంగం పాక్‌లోని ఉగ్రమూకలపై దాడి చేసి కుదిపేయాలన్నారు. అఫ్గాన్‌లోని ఐసిస్ ఉగ్రవాద సంస్థ స్థావరాలపై అతిపెద్ద బాంబును ప్రయోగించిన నేపథ్యంలో ట్రంప్‌కు ఆయన సూచన చేశారు.

సమస్యగా తాలిబన్ల స్థావరాలు పాకిస్థాన్‌లోని తాలిబన్ల స్థావరాలు అఫ్గానిస్థాన్‌కు పెద్ద సమస్యగా మారాయని, అక్కడి ఉగ్రవాదులపైనా పోరాడాలని జల్మయ్ ఖలీద్ జాద్ అన్నారు. ఈయన బుష్‌ హయాంలో జల్మయ్‌ ఐరాసలో, అఫ్గాన్‌లో అమెరికా రాయబారిగా పని చేశారు. ట్రంప్‌ అధ్యక్ష ప్రచార సమయంలో ఆయన విదేశాంగ పాలసీకి సంబంధించి తొలి సమావేశాన్ని జల్మయ్‌ నిర్వహించారు.


తాలిబన్ల విషయంలో పాక్ పాలసీనే ఆప్గన్‌కు సమస్య ఉగ్రవాద వ్యతిరేక పోరుతో అమెరికా పలుచోట్ల ఉన్న ఉగ్రసంస్థలను కుదిపేయాలని ఖలీద్్ జాద్ వాషింగ్టన్‌లోని హుడ్సన్‌ ఇనిస్టిట్యూట్‌లో మాట్లాడుతూ చెప్పారు. తాలిబన్ల విషయంలో పాకిస్థాన్‌ పాలసీనే అఫ్గానిస్థాన్‌కు ఉన్న ప్రధాన సమస్యల్లో ఒకటి అన్నారు.

   trump-attack-on-pakh