రెచ్చగొడితే అణుదాడులు చేస్తాం: ట్రంప్‌కు ఉత్తర కొరియా హెచ్చరిక

Header Banner

రెచ్చగొడితే అణుదాడులు చేస్తాం: ట్రంప్‌కు ఉత్తర కొరియా హెచ్చరిక

  Wed Apr 12, 2017 20:42        Telugu, World

అమెరికా సైన్యం రెచ్చగొట్టే విధంగా ప్రవర్తిస్తే అణు దాడులకు దిగేందుకు కూడా వెనుకాడమని ఉత్తర కొరియా అధికారిక మీడియా హెచ్చరించింది. అమెరికా నేవీ స్ట్రైక్‌ గ్రూప్‌ పశ్చిమ పసిఫిక్‌లో కొరియా వైపు వస్తున్న నేపథ్యంలో ఉత్తర కొరియా పైవిధంగా స్పందించింది. చైనాకు అలవాటే: దలైలామా, మోడీపై ప్రశంస, ట్రంప్‌పై ఆగ్రహం ఉత్తర కొరియా సమస్యల కోసం ఎదురు చూస్తోందని, చైనా సహకారం ఉన్నా లేకపోయినా అమెరికా సమస్యల పరిష్కారం దిశగా వెళ్తొందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ట్వీట్‌ చేశారు.

కొరియా దిశగా.. మరోవైపు ఉత్తర కొరియా ఆరో అణు పరీక్షకు సిద్ధమవుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అలాగే అమెరికా నేవీకి చెందిన స్ట్రైక్‌ గ్రూప్‌ నౌక కార్ల్‌ విన్సన్‌ కూడా బల ప్రదర్శనకు కొరియా దిశగా వెళ్తోంది. దీంతో ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నాయి.

రెచ్చగొడితే సమాధానం చెప్తాం ఈ నేపథ్యంలో ఉత్తర కొరియా.. అమెరికాకు హెచ్చరికలు జారీ చేసింది. అమెరికా ఏ విధంగానైనా రెచ్చగొడితే సమాధానం చెప్పడానికి సిద్ధమని రోడోంగ్‌ సిన్‌మున్‌ అనే పత్రిక పేర్కొంది. శత్రువుల ప్రతి కదలికను తమ శక్తివంతమైన సైన్యం కనిపెడుతోందని వెల్లడించింది. దీంతో ఉత్తర కొరియా చర్యలను జాగ్రత్తగా గమనించాలని దక్షిణ కొరియా తాత్కాలిక అధ్యక్షుడు తమ దేశ సైన్యానికి సూచించారు.

చైనా సాయం కోరిన ట్రంప్ ఉత్తర కొరియాతో సంబంధాల విషయంలో చైనా సాయం చేయాలని ఇటీవల అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ను కోరారు. ఒకవేళ చైనా సాయం చేస్తే గొప్పగా ఉంటుందని, లేదంటే తామే సమస్య పరిష్కరిస్తామన్నారు. గత వారం ట్రంప్‌ ఫ్లోరిడాలో జిన్‌పింగ్‌ను కలిశారు.

అమెరికాతో టచ్‌లో దక్షిణ కొరియా కాగా, సిరియా మీద క్షిపణి దాడుల అనంతరం అమెరికా యుద్ధ నౌకలు ఉత్తర కొరియా దిశగా వెళ్లాయి. దాంతో కొరియా తీరంలో ఉద్రిక్తతలు పెరిగాయి. ఇదిలా ఉండగా ఉత్తర కొరియా రెచ్చగొట్టేలా వ్యవహరిస్తోందని దక్షిణ కొరియా తాత్కాలిక అధ్యక్షులు హా్వాంగ్ క్వో ఆన్ అన్నారు. తమ సైన్యం పూర్తి సన్నద్ధంగా ఉండటంతో పాటు అమెరికాతో ఎప్పటికప్పుడు టచ్‌లో ఉండాలన్నారు.

   koria-gives-shok-to-america