దుబాయ్ లో భారత ప్రవాసికి అదృష్టం అలా తలుపు తట్టింది

Header Banner

దుబాయ్ లో భారత ప్రవాసికి అదృష్టం అలా తలుపు తట్టింది

  Wed Apr 12, 2017 10:24        Gulf News, Telugu

దుబాయ్ లో భారత ప్రవాసికి అదృష్టం అలా తలుపు తట్టింది

భలే అదృష్టం అతని ఇంటి తలుపు సకాలంలో తట్టినట్టు ఉంది. దుబాయ్ లో చమురు ధరల ఆర్ధిక మాంద్యం ఉద్యోగాలు లేవు అంటూ తిప్పి పంపెస్తున్న ప్రభుత్వం ఇలాంటి సమయంలో లంకె బిందెలు దొరికినట్లుగా ఒకటి కాదు రెండు కాదు 1$ మిలియన్ డాలర్ల (సుమారుగా 65 కోట్లు )లాటరీ తగిలింది ఈ 34 ఏళ్ల భారత ప్రవాసికి  ఇన్స్యూరెన్స్ ఏజెంట్ కి. వేణు గోపాల్ పాసన్ అతని పేరు. అసలు ఆతను ఎప్పుడు లాటరీ కొనడు ఆ అలవాటే లేదు. తన 2 ఏళ్ల కొడుకుద్వారా దుబాయ్ఒ డ్యూటీ ఫ్రీ ప్రొమోషన్ లో ఒక  లాటరీ కొన్నాడట అంతే అదృష్టం అమాంతం వచ్చి తలుపుతట్టింది. కష్టే ఫలి అన్నారు పెద్దలు కష్టపడకుండానే అలా కొట్లాదికారి అయిపోయాడు ఈ 34 ఏళ్ల యువకుడు.  షార్జా లో  ఇన్స్యూరెన్స్ ఏజెంట్ గా   విధులు నిర్వహిస్తున్న భారత ప్రవాసికి  అదృష్టం లంగరు వేసి జీవితాన్ని బంగారుమయంగా మార్చివేసింది. దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం బి లో  ప్రజల సమక్షంలో మంగళవారం ఉదయం జరిగిన ఒక డ్రా తీయగా వేణుగోపాల్ అనే వ్యక్తికి లాటరీ దక్కింది.

దుబాయ్ డ్యూటీ ఫ్రీ మిలీనియం మిల్లియనీర్ ప్రమోషన్ లాటరీలో  దుబాయ్ డ్యూటీ ఫ్రీ 1 మిలియన్ డాలర్ల బహుమతి  ఆయన టికెట్టుకు 239 సిరీస్ లో నెంబర్ 2324 ఆ బహుమతి వరించింది. తానూ తన రెండున్నర ఏళ్ల బాబు చేత ఆన్ లైన్లో టికెట్ ని కొనిపించానని ఇదంతా బాబు చాలవ అని . ..ఈ బహుమతిని పొందడంతో ఈ అనుభూతిని చెప్పడానికి ఎలాంటి పదాలు లేవని తడబడ్డాడు. ఈ విజయం తనకి బలం ఇచ్చింది అని ఆయన సంబరపడ్డాడు.


   Indian expat, $1 million, Free raffle