భూమిని దత్తత తీసుకోండి.. నాసా వినూత్న ప్రచారం

Header Banner

భూమిని దత్తత తీసుకోండి.. నాసా వినూత్న ప్రచారం

  Tue Apr 11, 2017 22:01        Reach Us, Science, Telugu

అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) ఓ వినూత్న ప్రచారానికి శ్రీకారం చుట్టింది. ఏప్రిల్ 22న ఎర్త్ డే (ధరిత్రి దినోత్సవం) సందర్భంగా భూమిలోని ఓ భాగాన్ని దత్తత తీసుకోవాలని ప్రపంచవ్యాప్త ప్రజలకు పిలుపునిచ్చింది. దీని కోసం భూ, సముద్ర ప్రాంతాలను 64,000 భాగాలుగా శాటిలైట్ మ్యాప్‌లో విభజించింది. ఓ ప్రత్యేక వెబ్‌ సైట్ కూడా నాసా లాంచ్ చేసింది.
 
 
https://climate.nasa.gov/adopt-the-planet/#/ లింక్ ద్వారా ఎవరైనా తమ పేరుతో భూ భాగాన్ని దత్తత తీసుకోవచ్చు. దీనికి సంబంధించి ఆ వ్యక్తి పేరు, దత్తత తీసుకున్న భూభాగం వివరాలతో ఈ సర్టిఫికేట్ కూడా వస్తుంది. దీన్ని ప్రింట్ తీసుకోవడంతో పాటు మనకు తెలిసిన వారికి ఎంచక్కా షేర్ కూడా చేసుకోవచ్చు.
 
 
అయితే దత్తత తీసుకున్న ఆ భూభాగంపై వారికి ఎలాంటి చట్టపరమైన హక్కులు ఉండవని నాసా స్పష్టం చేసింది. ఈ ఏడాది ధరిత్రి దినోత్సవం సందేశమైన పర్యావరణం, వాతావరణంపై అవగాహనకు ఈ ప్రచారం చేపడుతున్నట్లు నాసా వివరించింది.


   భూమిని దత్తత తీసుకోండి.. నాసా వినూత్న ప్రచారం