ఏపీఎన్నార్టీకి ఈ-హెల్త్‌ క్లస్టర్‌ ప్రాజెక్టు

Header Banner

ఏపీఎన్నార్టీకి ఈ-హెల్త్‌ క్లస్టర్‌ ప్రాజెక్టు

  Tue Apr 11, 2017 13:34        APNRT, అమరావతి కబుర్లు, Telugu

ఏపీఎన్నార్టీకి ఈ-హెల్త్‌ క్లస్టర్‌ ప్రాజెక్టు


నవ్యాంధ్ర రాజధాని ప్రాంతంలోని మంగళగిరిలో ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేయనున్న ఈ-హెల్త్‌ క్లస్టర్‌ బాధ్యతను ఏపీ ప్రభుత్వం.. ఆంధ్రప్రదేశ్‌ నాన్‌-రెసిడెంట్‌ తెలుగు సొసైటీ (ఏపీఎన్నార్టీఎస్‌)కు అప్పగించింది. ఏపీఎన్నార్టీ అందిస్తున్న ఈ సేవలను గమనించిన మంత్రి నారా లోకేశ్‌.. తాజాగా ఈ-హెల్త్‌ క్లస్టర్‌ బాధ్యతను కూడా ఏపీఎన్నార్టీ భుజస్కంధాలపైనే ఉంచారు. ఈ క్రమంలోనే.. ఈ-హెల్త్‌ క్లస్టర్‌ ప్రాజెక్టు రూపకల్పన నుంచి అమలు దాకా పర్యవేక్షణ బాధ్యతను.. విదేశాల్లో వైద్యుడిగా రాణించి, ఈ-హెల్త్‌లో అపార అనుభవం ఉన్న ఏపీఎన్నార్టీ సీఈవో డాక్టర్‌ రవి వేమూరుకు అప్పగించారు. ఈ మేరకు ఆ బృందంతో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ఈ ప్రాజెక్టు వల్ల.. సమాచార సాంకేతిక వ్యవస్థ ద్వారా ప్రపంచంలోని అత్యాధునిక వైద్య సేవలు, సమాచారం రాష్ట్రంలో అందుబాటులోకి రానున్నాయి. అలాగే, ఇతర దేశాలకు చెందిన క్లైంట్లకు ఐటీ, బీపీవోల ద్వారా సేవలు అందిస్తారు. కాగా.. ఈ-హెల్త్‌ క్లస్టర్కు అవసరమైన ఐటీ సిబ్బందికి తగిన శిక్షణను ఇచ్చే బాధ్యతను ప్రభుత్వమే తీసుకుంటుందని ఐటీ కంపెనీలకు లోకేశ్‌ హామీ ఇచ్చారు. మంగళగిరిలో ఏర్పాటుచేయనున్న ఈ-హెల్త్‌ క్లస్టర్‌ బీపీవోలలో దాదాపు 3000 మందికి ఉపాధి అవకాశాలు దక్కనున్నాయని అధికారులు వెల్లడిస్తున్నారు.   apnrt,nara lokesh,chandrababu naidu,health