చేజెర్ల భరత్ రాజ్ పుట్టినరోజు సందర్భంగా ఆంధ్ర యూత్ అసోసియేషన్ కువైట్ వారి ఆధ్వర్యంలో బియ్యం పంపిణీ

Header Banner

చేజెర్ల భరత్ రాజ్ పుట్టినరోజు సందర్భంగా ఆంధ్ర యూత్ అసోసియేషన్ కువైట్ వారి ఆధ్వర్యంలో బియ్యం పంపిణీ

  Tue Apr 11, 2017 10:54        Associations, Helping Hand, Telugu, Kuwait

 చేజెర్ల భరత్ రాజ్ పుట్టినరోజు సందర్భంగా ఆంధ్ర యూత్ అసోసియేషన్ కువైట్ వారి ఆధ్వర్యంలో బియ్యం పంపిణీ

ఇంద్రాణి చారిటబుల్ ట్రస్ట్ చేజెర్ల ఇందర్ రాజ్ కుమార్ మరియు శ్రీమతి కళా ఇందరాజ్ దంపతుల ముద్దుల తనయుడు చేజెర్ల భరత్ రాజ్  పుట్టినరోజు సందర్భంగా నిన్న ఆంధ్ర యూత్ అసోసియేషన్ కువైట్ బియ్యం పంపిణీ

మానవసేవే మాధవ సేవ అన్న సేవ తత్పరతతో అన్నార్తులకి , ఆపదలో ఉన్నవారికి సహాయం చేద్దాం రండి అని పిలుపునిస్తూ ఆంధ్ర యూత్ అసోసియేషన్, కువైట్ ఆధ్వర్యంలో శ్రీ చేజెర్ల ఇందర్ రాజ్ మరియు శ్రీ కే సుధాకర్ రావు లాంటి శ్రేయోభిలాషుల సహకారంతో  ఇంద్రాణి చారిటబుల్ ట్రస్ట్ చేజెర్ల ఇందర్ రాజ్ కుమార్ మరియు శ్రీమతి కళా ఇందరాజ్ దంపతుల ముద్దుల తనయుడు చేజెర్ల భరత్ రాజ్  పుట్టినరోజు సందర్భంగా నిన్న ఆంధ్ర యూత్ అసోసియేషన్ కువైట్ మూడు ప్రదేశాలలో బియ్యం బస్తాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టింది. చిన్నారి భరత్ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో తులతూగాలని దీవిస్తూ పేదలకి బియ్యం పంపిణీ చేసి పుట్టినరోజు వేడుకను సేవాకార్యక్రమాలతో చేసుకుని అందరికీ ఆదర్శంగా నిలిచారు.

ఆంధ్ర యూత్ అసోసియేషన్ కువైట్  సేవానిరతికి కువైట్ ఎన్నారైస్ అభినందనలు,ఇలా వీరు మంచి కార్యక్రమాలు మరిన్ని చేయాలనీ ఆకాంక్షిస్తూ .... ఎలాంటి సందర్భంలో అయినా ఆంధ్ర యూత్ అసోసియేషన్ కువైట్  సహాయ సహకారాలకు   సంప్రదించవలసిన నంబర్స్ 50933093; 65875040; 55734466.   indra raju ,andra association kuwait,in kuwiat,rice distribuytion