వార్తలు చదివే టైంలో.. నోరు తెరిచి: న్యూస్ రీడర్ ఉద్యోగం ఉడింది

Header Banner

వార్తలు చదివే టైంలో.. నోరు తెరిచి: న్యూస్ రీడర్ ఉద్యోగం ఉడింది

  Mon Apr 10, 2017 21:22        Telugu, World

న్యూస్ రీడర్లు వార్తలు చదివేటప్పుడు చాలా అప్రమత్తంగా ఉంటారు. ఒక వార్త చదివి కొంచెం విరామం ఇచ్చి, మరో వార్త చదివే సమయంలో కదలకుండా అప్రమత్తంగా ఉంటారు. విషయం తెలిసినా...: భర్త మృతినే బ్రేకింగ్ న్యూస్‌గా చదివిన న్యూస్ యాంకర్ కానీ ఏబీసీ24 ఛానెల్‌లో న్యూస్ రీడర్‌గా పని చేస్తున్న నటాషా ఎక్సెల్బీ మాత్రం అలా కదలకుండా ఉండలేకపోయింది. అప్పటి వరకు వార్తలు చదివిన నటాషా క్రీడావార్తలు చెప్పాల్సిన సమయంలో ఏమరపాటుగా గోళ్లు చూసుకుంటూ పెన్ను పట్టుకుని ఏదో ఆలోచిస్తూ ఉండిపోయింది.
టీవీ స్క్రీన్‌లో తన మొహం కనిపించే సరికి ఒక్కసారిగా ఉలిక్కిపడి చేతిలో ఉన్న పెన్ను విసిరేసి మళ్లీ వార్తలు చదవటం ప్రారంభించింది. అప్పటికే ఆమె రియాక్షన్‌ టీవీలో ప్రసారమైపోవడంతో ఆ క్లిప్‌ వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసి చాలామంది న్యూస్ రీడర్లకు వచ్చే అసలైన పీడకల ఇదేనని కామెంట్స్‌ చేశారు. కాగా, ఆమె తన ఉద్యోగాన్ని కూడా కోల్పోయిందని తెలుస్తోంది.


   job-loss