రాజ్యాంగాన్ని తూట్లు పొడుస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి : వైకాపా కువైట్ కన్వీనర్ ముమ్మడి బాలిరెడ్డి

Header Banner

రాజ్యాంగాన్ని తూట్లు పొడుస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి : వైకాపా కువైట్ కన్వీనర్ ముమ్మడి బాలిరెడ్డి

  Sat Apr 08, 2017 15:30        Associations, Kuwait, Telugu

కువైట్: పార్టీ రాష్ట్ర ఆదేశానుసారం ఎడారి ప్రాంతమైన కువైట్ లో వైకాపా కువైట్ యూత్ విభాగం ఇంచార్చ్ మర్రి కళ్యాణ్ ఆధ్వర్యములో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు రాజ్యాంగాన్ని తూట్లు పొడుస్తున్నా తీరును ప్లే కార్డులు పట్టి నిరసన తెలిపారని బాలిరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భముగా బాలిరెడ్డి మాట్లాడుతూ ప్రతిపక్షం ఉన్నప్పుడు నీతులు వల్లించి రాజ్యరంగం గురించి చిలక పలుకలు పలికే చంద్రబాబు    రాజ్యాంగాన్ని తూట్లు పొడుస్తున్నారని ఎద్దేవా చేశారు .  మర్రి కళ్యాణ్ మాట్లాడుతూ  భారతదేశంలో ఎన్ని మతాల  గ్రంధాలు  ఉన్నాయో  తమ   గ్రంధాలను  ఏ  విధంగా  గౌరవిస్తారో ఆ  విధంగా  డా: బాబాసాహెబ్ అంబేద్కర్ వ్రాసిన రాజ్యాంగాన్ని అన్ని రాజకీయ పార్టీలు తప్పనిసరి గౌరవయించాలి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అధికార మదంతో రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నారని తెలిపారు ఈ కార్యక్రమములో  కో కన్వీనర్లు గోవిందు  నాగరాజు, యం.వి నరసారెడ్డి, ప్రధానకోశాధికారి నాయని మహేష్ రెడ్డి, సేవదళ్ ఇంచార్జీ గోవిందు రాజు ,  కల్చరల్ విభాగం  ఇంచార్జ్ కల్లూరు వాసు  రెడ్డి ,   ఎస్సీ  సెల్  విభాగం  ఇంచార్చ్ బి.యన్.సింహా, కోశాధికారి ఆకుల చలపతి, యూత్  సభ్యులు సయ్యద్ సజ్జాద్, రఫీక్ ఖాన్, బిసి నాయకులు రావురి రమణ, హనుమంత్ రెడ్డి, షేక్  కలామ్,షేక్ సబ్దర్,శివబాల, ఓబులపు మోహన్ రెడ్డి ,పిడుగు  సుబ్బరెడ్డి,రవి శంకర్,కార్తీక్, ప్రసాద్ భారీగా అభిమానులు కార్యకర్తలు  పాల్గోన్నారు   ముమ్మడి బాలిరెడ్డి,in kuwait,chandra babu naidu