కువైట్ లో APNRT అవగాహనా సమావేశం.. మహిళా ప్రవాసుల ఉత్సుకత

Header Banner

కువైట్ లో APNRT అవగాహనా సమావేశం.. మహిళా ప్రవాసుల ఉత్సుకత

  Sat Apr 08, 2017 11:32        APNRT, Kuwait, Telugu

కువైట్ ఒమారియా పార్క్ లో నిన్న సాయంత్రం మిడిల్ ఈస్ట్ కో ఆర్డినేటర్ చప్పిడి రాజశేఖర్ గారు మరియు మిగతా ఎపి ఎనార్తీ కో ఆర్దినేటర్స్ అయిన కేతినేని ప్రసాద్ గారు (స్కై నెట్) మాలేపాటే సురేష్ బాబు నాయుడు గారు, కొత్తపల్లి రాం మోహన్ గారి అధ్య్వర్యంలో  ఎపి ఎన్నార్టీ అవగాహన సమావేశం జరిగింది.


ఈ నేపధ్యంలో కువైట్ లో ఉన్న తెలుగు ప్రవాస గ్రూప్ లని కలిసి ఎపి ఎన్నార్టీ గురించి వాటి సహకారాల గురించి వివరించడం జరిగింది అంతే కాకుండా ప్రభుత్వం ఎపి ఎన్నార్టీ ద్వారా కొత్తగా ప్రేవేశ పెట్టబోతున్న గల్ఫ్ పాలసీ గురించి కూడా వివరించి చెప్పి ఎపి ఎన్నార్టీ సభ్యులుగా జాయిన్ అవమని అందులోని ఆవశ్యకతని వివరించారు. వచ్చినవారు ఎపి ఎన్నార్టీ పట్ల ఏంతో ఆసక్తి కనబరచడం విశేషం. వాళ్ళే కాకుండా వారి ఫ్రండ్స్ కూడా ఎపి ఎన్నార్టీ గురించి ఒక అవగాహన కలిపించి సభ్యులుగా చేర్చమని కో అర్దినేటర్స్ విన్నవించారు. వారి వారి స్వగ్రామలకి చెందిన ప్రవాసులని కలిసి ఎపి ఎన్నార్టీ గురించి తెలుపుతామని అందరూ ప్రామిస్ చేసారు. ఎక్కువగా మహిళా ప్రవాసులు ఎపి ఎన్నార్టీ పట్ల ఉత్సుకత చూపడం ప్రశాసించతగ్గ విషయం.

 


   apnrt meet, apnrt women wing, womens at meeting, apnrt, non resident telugu, andhra pradesh nri