ఇకపై నిత్యమూ మారే పెట్రోలు ధరలు?

Header Banner

ఇకపై నిత్యమూ మారే పెట్రోలు ధరలు?

  Fri Apr 07, 2017 12:54        Business, Telugu

అంతర్జాతీయ క్రూడాయిల్ ధరల సరళికి అనుగుణంగా ప్రస్తుతం పదిహేను రోజులకు ఒకసారి మారుతున్న భారత పెట్రో ఉత్పత్తుల ధరలు ఇకపై రోజువారీ ధర ఆధారంగా మార్చేలా ప్రభుత్వ రంగ సంస్థలు కీలక నిర్ణయం తీసుకోనున్నాయని తెలుస్తోంది. ఇండియాలోని రిటైల్ ఫ్యూయల్ మార్కెట్లో 90 శాతం వాటా ఉన్న ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం సంస్థలు రోజువారీ ధరా విధానాన్ని అమలు చేసేందుకు యోచిస్తున్నాయని 'ఎకనామిక్ టైమ్స్'లో ప్రత్యేక కథనం ప్రచురితమైంది.

రోజువారీ ధరలను మార్చే పద్ధతిని డైమనిక్ ఫ్యూయల్ ప్రైసింగ్ గా పేర్కొంటూ ఈ విధానం వస్తే, ఇంధన ధరలను మరింత పాదర్శకంగా అమలు చేయవచ్చని, ఇండియా సైతం అంతర్జాతీయ ఫ్యూయల్ ప్రైసింగ్ విధానంలోకి వెళ్లినట్లవుతుందని ఆయిల్ కంపెనీలు భావిస్తున్నట్టు తెలుస్తోంది. కాగా, దీనిపై స్పందించేందుకు ఓఎంసీలు నిరాకరించాయి. ఇదిలావుండగా, ఇండియాలో పెట్రోలు, డీజెల్ ధరలను అమ్ముతున్న ప్రైవేటు సంస్థలైన ఎస్సార్ ఆయిల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ కంపెనీలు ఇప్పటికే డైనమిక్ మోడల్ లోకి ప్రవేశించి, రోజువారీ ధరా మార్పును అమలు చేస్తున్న సంగతి తెలిసిందే.   crude oil prices, petro prices, fuel market