గల్ఫ్ సినిమా దుబాయ్ మరియు షార్జా ప్రమోషనల్ అంబాసిడర్ గా రవి ఉట్నూరి మరియు రాజేష్ వేమూరి

Header Banner

గల్ఫ్ సినిమా దుబాయ్ మరియు షార్జా ప్రమోషనల్ అంబాసిడర్ గా రవి ఉట్నూరి మరియు రాజేష్ వేమూరి

  Thu Apr 06, 2017 21:38        Telugu, Cinemas in Kuwait

గల్ఫ్ అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేవి అక్కడి కార్మికుల కష్టాలు కానీ గల్ఫ్ అంటే కష్టాలే కాదు ఎన్నో విజయ గాధల సమాహారం అనే నేపథ్యంతో 'శ్రావ్య ఫిలిమ్స్' బ్యానర్ పై సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'గల్ఫ్'. ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది. 

ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్ కు యు.ఏ.ఈ లో పలువురిని డైరెక్టర్ సునీల్ కుమార్ రెడ్డి ప్రమోషనల్ అంబాసిడర్లగా నియమించారు.ఇంకా వేరే ఎమిరేట్స్ మరియు దేశాల్లో కూడా నియామకాలు జరుగుతున్నాయి.
త్వరలో మాగల్ఫ్ ద్వారా వివరాలు తెలియజేస్తారు.

రవి ఉట్నూరి (దుబాయ్)
--------------------------

రవి ఉట్నూరి తెలంగాణ జగిత్యాల జిల్లా ఇతికీయాల్ కు చెందినవారు.ప్రస్తుతం మెర్హిస్ ఇంటర్నేషనల్ కాంట్రాక్టింగ్ కంపెనీలో ప్రొక్యూర్మెంట్ & ఆపరేషన్స్ మేనేజర్ గా పని చేస్తున్నారు.

రాజేష్ వేమూరి(షార్జా)
-----------------------

రాజేష్ వేమూరి ఆంధ్ర ప్రదేశ్ కృష్ణా జిల్లా ఘంటసాలకు చెందినవారు. ప్రస్తుతం దుబాయ్ లో ని ఓ ప్రముఖ పాకేజింగ్ సంస్థలో బిజినెస్ డెవలప్ మెంట్ మేనేజర్ గా పని చేస్తున్నారు. 

ఈ సినిమాకు మాగల్ఫ్.కాం మీడియా పార్టనర్ గా వ్యవహరిస్తోంది.

 


   గల్ఫ్ సినిమా దుబాయ్ ప్రమోషనల్ అంబాసిడర్ గా రవి ఉట్నూరి