వాట్సాప్ నుంచి త్వరలో సరికొత్త ఫీచర్

Header Banner

వాట్సాప్ నుంచి త్వరలో సరికొత్త ఫీచర్

  Thu Apr 06, 2017 15:46        Technology, Telugu

ప్రముఖ మైక్రోబ్లాగింగ్ యాప్ వాట్సాప్ నుంచి త్వరలో సరికొత్త ఫీచర్ రాబోతోంది. మల్టిపుల్ కాంటాక్ట్ సెలక్షన్ ఆప్షన్‌ను వాట్సాప్ త్వరలో ప్రవేశపెట్టబోతోంది. ఇప్పటి వరకు వాట్సాప్‌లో ఇద్దరుముగ్గురికి మెసేజ్ పంపాలంటే తొలుత వారిని సెలక్ట్ చేసుకుని బ్రాడ్‌కాస్ట్ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదంటే గ్రూప్ క్రియేట్ చేసుకోవాలి. అలా కాకుండా ఎవరికి వారికి వేర్వేరుగా పంపుకుంటే బాగుంటుందని అనుకునేవారికి కొత్తగా రాబోతున్న ఆప్షన్ ఉపయోగకరంగా ఉంటుందని వాట్సాప్ పేర్కొంది. మొబైల్‌లో మామూలు మెసేజ్‌లు పంపినప్పుడు కాంటాక్టులను సెలక్ట్ చేసుకున్నట్టుగానే వాట్సాప్‌లోనూ అలా ఎంచుకునే వెసులుబాటు రాబోతోందని తెలిపింది.   whats app, new feature,for all