రసపట్టు జడా..బుసకొట్టు జడా..నసపెట్టు జడా ఇపుడెందుకే ఈ రగడా - నిజమా ఈ వీడియో చూడండి మీకే తెలుస్తుంది

Header Banner

రసపట్టు జడా..బుసకొట్టు జడా..నసపెట్టు జడా ఇపుడెందుకే ఈ రగడా - నిజమా ఈ వీడియో చూడండి మీకే తెలుస్తుంది

  Wed Apr 05, 2017 18:31        Exclusives, Telugu

ఓ వాలుజడా..మల్లెపూల జడా..ఓ పాము జడా..సత్యభామ జడా

రసపట్టు జడా..బుసకొట్టు జడా..నసపెట్టు జడా ఇపుడెందుకే ఈ రగడా

నాగరం ధరియించిన

నాగుబామొక్కటి

నవ్వుచూ నిలుచుండి చూస్తున్నయట్లు

నల్లని వాలుజడ అనిపించ

పెళ్ళిచూపులకొచ్చిన పెళ్ళికొడుకు

పిల్ల వెళుతుండగా అందమైన జడను

పరవశముతో గాంచుచూ

పెళ్ళికి వెంటనే ఒప్పుకొనగ

ఇలా జడ గురించి ఎన్నెన్ని వర్ణనలు, కను ముక్కు తీరు బాగున్నా జడ ఎలా ఉంది అని చూసేవాళ్ళు పూర్వపు రోజులలో.... జడతో కొట్టక మానను అనే మాట మరువగలమా... జడను గురుంచి ఎన్నెన్ని కావ్యాలు , రాసికప్రియుల మన్మధ బాణం జడ అంటారు సాహితీ ప్రియులు. అలాంటి జడ, జుట్టు పొడుగు ఉన్న ఓ అమ్మాయి ఓ బ్యూటీ పార్లేల్ కి వెళ్తుంది ఆమె జుట్టు చూసి ఆ బ్యూటీ పార్లేల్ అమ్మాయిలు ముచ్చట పడి పోతారు చివర కట్ చేస్తే చాలా అని అడుగుతారు. ఉహు ఇంకొంచం , ఇంకోచం అంటూ వాళ్ళు ఆ జుట్టు ని బాబ్డ్ హెయిర్ చేసేదాక వదలలేదు మనసు రాకపోయినా కస్టమర్  సాతిస్ఫక్షన్ బుసినెస్ ధర్మం కాబట్టి తప్పక ఆమె చెప్పినట్లు చేసారు. ఆమె కన్నీటితో తన జుట్టుని తడుముకుంది. కింద పది ఉన్న పొడవాటి జుట్టు ఆనవాళ్ళని చూసి బాధపడుతుంది. మళ్ళీ ఒకసారి జుట్టు కట్ చేసిన ఆమె వైపు చూసి పిడికిలో జుట్టు పట్టుకుని కన్నీటితో అంటుంది కనీసం ఇలా పిడికిలికి కూడా రాకుండా జుట్టు కట్ చేయగలవా అని అడుగుతుంది . ఎంత ఆర్థ్రం అందులో ఎంత అర్థం నిగూఢమయి ఉంది. జుట్టు పట్టుకుని ఈడ్చి కొట్టే పురుషాధిక్య ప్రపంచంలో ఉన్నామని, జుట్టే మన గర్వకారణం అని మురిసిపోతున్నాము కాని అదే మనపాలిత శత్రువు అవుతోంది అని తెలియజెప్పే ఒక అద్భుతమయిన వాణిజ్య ప్రకటన. మనసుని కలిచివేయకమానాడు ఈ ప్రకటన మీరు చూడండి. కంటనీరు తెప్పించే ఈ స్లోగన్ కూడా hair the pride of women ....అవును బానిసగా బతకడానికి ఒకరి పిడికిలో మిగలడానికి ఉపయోగపడ్తున్న జుట్టు అది... టచింగ్ వీడియో.


   hair the pride of women,