ఏప్రిల్ 8 న సిని నటి గౌతమి మరియు పద్మశ్రీ శోభన గారిచే మరియు కువైతి కళాకారుల చే లైఫ్ అగైన్ భారి కార్యక్రమం - గౌతమి తో కువైట్ ఎన్నారైస్ ప్రత్యెక ఇంటర్వ్యూ

Header Banner

ఏప్రిల్ 8 న సిని నటి గౌతమి మరియు పద్మశ్రీ శోభన గారిచే మరియు కువైతి కళాకారుల చే లైఫ్ అగైన్ భారి కార్యక్రమం - గౌతమి తో కువైట్ ఎన్నారైస్ ప్రత్యెక ఇంటర్వ్యూ

  Wed Apr 05, 2017 18:18        Associations, Exclusives, Kuwait, Telugu

క్యాన్సర్ పైన ప్రజలలో అవగాహన కల్పించేందుకు ప్రముఖ నటి గౌతమి లైఫ్ అగైన్ పేరుతో ఓ సోషల్ ఆర్గనైజేషన్‌ను ప్రారంభించారు. హైమారెడ్డి ఈ సంస్థకు సహ వ్యవస్థాపకురాలిగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల లైఫ్ ఎగైన్ పేరుతో ఓ వెబ్ సైట్‌ను నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత ప్రారంభించారు.క్యాన్సర్ వ్యాధితో ప్రతి ఏటా చాలామంది ప్రజలు మృత్యువాత పడుతున్నారు. ఈ నేపథ్యంలో వారికి ఉపయోగకరంగా ఉండేందుకు లైఫ్ అగైన్ వెబ్ సైట్ ప్రారంభించారు.


ఈ సందర్భం గా కువైట్ లో కాన్సర్ పై అవగాహన పెంపోన్దిన్చేదుకు  ఏప్రిల్ 8 ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ట్రాన్స్ డాన్సింగ్ డ్రంమ్స్ పేరిట పద్మశ్రీ శోభన గారిచే అమెరికన్ స్కూల్ ఆఫ్ కువైట్  ప్రాంగణం, హవల్లి, కువైట్ లో లైఫ్ అగైన్ అధ్వర్యంలో నృత్య  ప్రదర్శన వేడుకలు జరగనున్నాయి.

ఈ మొత్తం కార్యక్రమం  వెంకట్ కోడూరి, ప్రవాసాంధ్ర తెలుగుదేశం కువైట్ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు ఎపి ఎన్నార్టీ కువైట్ కో ఆర్డినేటర్;  వినయ్ కుమార్ ముత్యాల, కువైట్ జాగృతి ప్రెసిడెంట్;  హైమా రెడ్డి , లైఫ్ అగైన్ సహా వ్యవస్థాపకురాలు ల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది.

ఈ కర్య్రక్రమం లో ప్రముఖ కువైతి మహిళలు హెలెన్ అల్ రహిజుంబ ఇన్స్ట్రక్టర్ మరియు special needs teachar,  రేహెం అల్ రాషిది లైఫ్ కోచ్ మరియు Reham TV founder, జైనా అల్ అల్జాబిన్ founder Masar Consults   ప్రత్యక వ్యాఖ్యతలు గా వ్యవహరిస్తున్నారు.

ఈ కార్యక్రమం లో మరొక ప్రతేక ఆకర్షణ ఏమంటే... ప్రక్యాత కువైతి గాయకుడూ, ఇండియాన్స్ కు సుపరిచితుడు ఐనటువంటి ముబారక్ అల్ రషేద్, హిందీ మలయాళం పాటలతో అలరించా బోతున్నారు...

క్యాన్సర్ బాధితుల్లో కొందరినైనా కాపాడేందుకు, మరికొంతమందిలో అవగాహన తెచ్చేందుకు లైఫ్ ఎగైన్ తరఫున చేస్తోన్న ఈ ప్రచారం ఉపయోగకరంగా ఉంటుందని క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న వారికి సాయం చేసేందుకు, ప్రజలలో అవగాహన పెంచేందుకు ముందుకు వచ్చిన గౌతమి, మరియు ఈ కార్యక్రమం నిర్వాహకులు శ్రీ వినయ్ కుమార్ ముత్యాల, శ్రీ వెంకట్ కుదోరి మరియు హైమారెడ్డిల కృషి విజయవంతమవ్వాలని కార్యక్రమానికి కువైట్ లోని ప్రవాసులందరూ హాజరకావాలని కోరుకుంటూ హృదయపూర్వక అభినందనలతో కువైట్ ఎన్నారైస్

 

ఈ సందర్భంగా ప్రస్తుతం సినీ నటి గౌతమి కువైట్ పర్యటనలో ఉన్నారు. ఈ నేపధ్యంలో నిన్న అనగా మంగళవారం 4/4/2017 న లైఫ్ అగైన్ ప్రెస్ మీట్ శ్రీమతి విజయ నిర్మల్ మరియు రాజ శేఖర్ చప్పిడి గార్ల ఆధ్వర్యం లో గౌతమి గారు  నిర్వహించారు.

ఈ ప్రెస్ మీట్ లో గౌతమీ కాన్సర్ అవగహన అంశాల గురించి చాల విషయాలు వెల్లడించారు. అలాగే ప్రముఖ అంతర్జాల పత్రిక కువైట్ ఎన్నారైస్ కి ప్రత్యెక ఇంటర్వ్యు ఇచ్చారు ఆ ఇంటర్వ్యూ ముఖ్య విశేషాలు .

కువైట్ ఎన్నారైస్ : నమస్కారం మేడం మీ గురించి ?

గౌతమి : నమస్తే అండి నా పేరు తాడిమల్ల గౌతమి, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ మరియు హిందీ  సినిమా నటిని. నాకు విశాఖపట్నంలో ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ చదువుతుండగా సినిమాలలో నటించే అవకాశమొచ్చింది. ఏసుక్రీస్తు జీవితగాథను చిత్రీకరించిన దయామయుడు సినిమాతో రంగప్రవేశం చేసాను. జంటిల్మెన్ సినిమాలో చుకు బుకు రిలే... పాటతో ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు.

కువైట్ ఎన్నారైస్: సినిమాలు మానేశారా?

గౌతమి: సినిమాలకి ఫుల్స్టాప్ పెట్టలేదు కామా మాత్రమె, సినిమా అన్నది నా జీవితంలో ఒక భాగం మాత్రమే, సినిమానే జీవితం కాదు. లైఫ్ గురించి తెలుసుకున్నాను. జీవితం గురించి చాలామందికి అవగాహన కల్పించాలి. దానికి నాకు సమయం కేటాయించుకున్నాను. సినిమాల్లో నటించే సమయం లేదు కాని ఏదన్నా సందేశాత్మక సినిమాలయితే తప్పక నటిస్తాను. ప్రజలని అన్ని విషయాల్లో అప్రమత్తం చేయాలన్నది నా ఆలోచన.

కువైట్ ఎన్నారైస్: లైఫ్ అగైన్ ముఖ్య ఉద్దేశ్యం గురించి? కువైట్ లో మిగతా దేశాల్లో ప్రచారం చేయడానికి గల కారణం?

గౌతమి : కాన్సర్  బాధితుల్లో కొందరినైనా కాపాడేందుకు, మరికొంతమందిలో అవగాహన తెచ్చేందుకు లైఫ్ ఎగైన్ తరఫున చేస్తోన్న ఈ ప్రచారం ఉపయోగకరంగా ఉంటుందని క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న వారికి సాయం చేసేందుకు, ఈ లైఫ్ అగైన్ ప్రారంభించాము.

కువైట్ ఎన్నారైస్ : ప్రచారాల వల్ల ఉపయోగం ఎంతవరకు ఉంటుంది అంటారు?

కాన్సర్ ని  పారదోలేందుకు  ప్రతి ఒక్కరూ చేతులు కలపాలని సినీ నటి గౌతమి పిలుపునిచ్చారు. ప్రస్తుతం ఈ వ్యాధి విస్తృతమవుతోందని, ప్రతి ఒక్కరి జీవితంలోనూ వారికి తెలిసిన ఎవరో ఒకరికి కేన్సర్ వస్తోందని ఆమె ఆవేదన వ్యక్తంచేశారు.  ‘నాకు కేన్సర్ వచ్చింది. కీమోథెరపీ చేయించుకున్నా. మళ్లీ వచ్చింది. చికిత్స చేయించుకుంటే మళ్లీ తగ్గింది. ఇలా వివిధ వేదికలపై కేన్సర్‌పై ప్రచారం చేయడాన్ని బాధ్యతగా భావిస్తున్నా. అందరికీ ఆ బాధ్యత ఉంది. ఇది కూడా ఇతర వ్యాధుల వంటిదే. దీన్ని మనం పారదోలగలం

అందుకే ప్రచారం సాగిస్తున్నా.. నా ప్రచారం కేవలం భారతదేశానికే పరిమితం కాకూడదు వివిధ దేశాల్లో ఉన్న వ్యాదిగ్రస్తులకి  నేనే ఒక స్ఫూర్తి కావాలి అన్నది నా ఆశయం.

కువైట్ ఎన్నారైస్: కాన్సర్ అనగానే అందరూ భయభ్రాంతులు అవుతారు. దీనికి అసలు క్యూర్ లేదంటారు..మీ స్పందన ఏంటి? 

 

గౌతమి: కాన్సర్  వచ్చిన వారికి మనోధైర్యం చాలా ముఖ్యం , శరీరంలో ఊపిరి ఉన్నంత వరకు పోరాడాల్సిందే!. ఇందుకోసం ప్రభుత్వ మద్దతు కూడా చాలా అవసరం . క్యాన్సర్ బాధితులను ఆదుకునేందుకు, కాన్సర్ భాదిత వ్యక్తులకు అండగా ఉండాలి.

కువైట్ ఎన్నారైస్ : ప్రభుత్వం అండగా ఉండడానికి మీరు ఎ విధమయిన చర్యలు తీసుకుంటున్నారు?

గౌతమి: నేను ఢిల్లీ లో  కేంద్రమంత్రి వెంకయ్యనాయడి గారిని కలిసాను. లైఫ్‌ అగైన్‌ ఫౌండేషన్‌ చేస్తున్న కార్యక్రమాలను వెల్లడించాను. దీని గురించి తెలుసుకున్న మోదీ సంతోషం వ్యక్తం చేశారని వెంకయ్యనాయుడు గారు  తెలిపారు. ఫౌండేషన్‌కు ప్రభుత్వ సహకారం కావాలని కోరాను.  మానవ సేవకు అందరూ కలిసి రావాలని నా ఆకాంక్ష.

కువైట్ ఎన్నారైస్: లైఫ్ అగైన్ కి మీ కో స్టార్స్ స్పందన ఎలా ఉంది?

గౌతమి: ‘లైఫ్ అగైన్’ అన్న స్లోగన్ గత కొంత కాలంగా  సోషల్ మీడియాలో విపరీతమైన ఆసక్తి రేకిత్తిస్తోంది. టాప్ సినిమా స్టార్స్ అందరు ఒక్కొక్కరిగా" లైఫ్ అగైన్ " అంటూ చెస్తొన్న ప్రచారం వ్యూవర్స్ లొ ఓ ఇంట్రస్ట్ ను క్రియెట్ చెసింది.. , ‘వన్ ఫర్ వన్.. వి ఆర్ దేర్ ఫర్ ఎవ్రీ వన్’ (ఒకరికి ఒకరం, అందరికోసం మనం) అన్న అర్థం వచ్చేలా సోషల్ మీడియాలో క్యాన్సర్ పై పొరాడెందుకు  ఓ క్యాంపెయిన్ నిర్వహిస్తున్నారు.  ఓ విధంగా ఓ రియలిస్టిక్ మూవీ కి ప్రమోషన్ లా లైఫ్ అగైన్ పై ప్రచారం నడుస్తొంది.సోషల్ మీడియా లో ఓ చిన్న మాటతొ మొదలైన ఈ లైఫ్ ఎగైన్ కు ,ఇప్పుడు వేల మంది

గొంతుకలు తొడయ్యాయి.. సామాన్యుల నుంచి సెలబ్రిటిల వరకు ఈ మంచి కార్యక్రమానికి బాసటగా నిలవటం అభినందనీయం.

కువైట్ ఎన్నారైస్: జాగృతి స్కిల్ సెంటర్ గురించి చెప్తారా?

గౌతమి: జాగృతి ద్వారా ఎంపీ కవిత అందిస్తున్న సేవలను చాల ప్రశంసనీయం. ఈ జాగృతి  సెంటర్ ద్వారా చేస్తున్న సామాజిక సేవను, కృషిని ంఅభినందనీయం. తెలంగాణ జాగృతి బహ్రెయిన్ శాఖ అధ్యక్షుడు హరిప్రసాద్, జాగృతి కువైట్ శాఖ అధ్యక్షుడు శ్రీ వినయ్, జాగృతి ఖమ్మం జిల్లా అధ్యక్షుడు సుందర్ , నేను కలిసి ఒక  మెగా వైద్య శిబిరానికి హాజరయ్యాము. ఈ మెగా వైద్య శిబిరాన్ని జాగృతి బహ్రెయిన్ శాఖ, మా  లైఫ్ అగైన్ ఫౌండేషన్ సంయుక్తంగా నిర్వహించాయి. అక్కడ మేము క్యాన్సర్ పైన ప్రజలలో అవగాహన కార్యక్రమం నిర్వహించి, నిపునులయిన డాక్టర్స్ చే కాన్సర్ నిర్ధారణ పరీక్షలు జరిపించాము.

కువైట్ ఎన్నారైస్ : మీ తదుపరి కార్యక్రమాలు ఏంటి?

గౌతమి : ఈ లైఫ్ అగైన్ నేపధ్యంలో కాన్సర్ అవగాహన కార్యక్రమం కోసం నేను ప్రధాన మంత్రి ని కలిసాను. నరేంద్రమోదీని కలుసుకోవడం సంతోషంగా ఉంది. మోడీ గారు తనను సాదరంగా ఆహ్వానించారు, ఆయన విజన్, రోల్‌ తదితర అంశాల గురించి నాతో పంచుకున్నారు.ఆ వ్యాధిపై అవగాహన కలిగించే విధంగా లైఫ్‌ అగైన్‌ ఫౌండేషన్‌ అనే స్వచ్ఛంద సంస్థను తాను నిర్వహిస్తున్నానని, 2017 యోగా దినోత్సవం నాటికి యోగా, ఆరోగ్యం వంటి అంశాలపై ప్రధాని సూచనల మేరకు నా వంతు కృషి చేయడానికి సిద్ధం అవుతున్నట్లు నేను ప్రధానికి తెలిపాను. లైఫ్ అగైన్ ఫౌండేషన్‌కు ప్రభుత్వ సహకారం కావాలని కోరిను.  దీనిపై వారు సానుకూలంగా స్పదించారు. భవిష్యత్తులో లైఫ్ అగైన్ ద్వారా ఏంతో మంది కాన్సర్ భాదిత వ్యక్తులకు ఇలా పలు కార్యక్రమాల ద్వారా , ప్రచారం ద్వారా మనోనిబ్బరం నిమ్పాలి అన్నది నా ఆశయం. చనిపోయే వరకు కాన్సర్ తో పోరాడదాం రండి అనేదే నా పిలుపు. అనుభవ పూర్వక పోరాటం నేనే స్ఫూర్తి కావాలి కాన్సర్ బాధితులకు.

కువైట్ ఎన్నారైస్ : ధన్యవాదాలు మేడం మీ ఆశయం నేరవరాలని. ఎంతోమంది కాన్సర్ పీడిత రోగాగ్రస్తులు మీ స్ఫూర్తితో మనోధైర్యంతో ఆ వ్యాధిని జయించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు ఇలాంటి ప్రచార కార్యక్రమాలు మరిన్ని దిగ్విజయంగా చేయాలని ఆశిస్తూ, మీకు మరియు లైఫ్ అగైన్ టీం కు కువైతెన్నరైస్ ఎల్ల వేళల సహాయ సహకారాలు అందిస్తామని తెలుపుకుంటూ...  సెలవు.


   Life again, World Health Day 2017, Sobhana, gouthami,