కువైట్ కు విచ్చేసిన ప్రముఖ సిని నటి గౌతమి - పద్మశ్రీ శోభన గారిచే క్యాన్సర్ పై అవగాహనా నృత్య ప్రదర్శన వేడుకలు

Header Banner

కువైట్ కు విచ్చేసిన ప్రముఖ సిని నటి గౌతమి - పద్మశ్రీ శోభన గారిచే క్యాన్సర్ పై అవగాహనా నృత్య ప్రదర్శన వేడుకలు

  Mon Apr 03, 2017 21:51        Associations, Helping Hand, Kuwait, Telugu

కువైట్ లో ప్రముఖ సిని నటి గౌతమి అధ్వర్యంలో లైఫ్ అగైన్ చారిటి షో : క్యాన్సర్ పై అవగాహనా షో

క్యాన్సర్ బాధితులను ఆదుకునేందుకు, క్యాన్సర్ పైన ప్రజలలో అవగాహన కల్పించేందుకు ప్రముఖ నటి గౌతమి లైఫ్ అగైన్ పేరుతో ఓ సోషల్ ఆర్గనైజేషన్‌ను ప్రారంభించారు. హైమారెడ్డి ఈ సంస్థకు సహ వ్యవస్థాపకురాలిగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల లైఫ్ ఎగైన్ పేరుతో ఓ వెబ్ సైట్‌ను నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత ప్రారంభించారు. క్యాన్సర్ వ్యాధితో ప్రతి ఏటా చాలామంది ప్రజలు మృత్యువాత పడుతున్నారు. ఈ నేపథ్యంలో వారికి ఉపయోగకరంగా ఉండేందుకు లైఫ్ అగైన్ వెబ్ సైట్ ప్రారంభించారు.

ఈ సందర్భం గా కువైట్ లో కాన్సర్ పై అవగాహన పెంపోన్దిన్చేదుకు  ఏప్రిల్ 8 ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ట్రాన్స్ డాన్సింగ్ డ్రంమ్స్ పేరిట పద్మశ్రీ శోభన గారిచే అమెరికన్ స్కూల్ ఆఫ్ కువైట్  ప్రాంగణం, హవల్లి, కువైట్ లో లైఫ్ అగైన్ అధ్వర్యంలో నృత్య  ప్రదర్శన వేడుకలు జరగనున్నాయి.

ఈ కర్య్రక్రమం లో ప్రముఖ కువైతి మహిళలు హెలెన్ అల్ రహిజుంబ ఇన్స్ట్రక్టర్ మరియు special needs teachar,  రేహెం అల్ రాషిది లైఫ్ కోచ్ మరియు Reham TV founder, జైనా అల్ అల్జాబిన్ founder Masar Consults   ప్రత్యక వ్యాఖ్యతలు గా వ్యవహరిస్తున్నారు.

క్యాన్సర్ బాధితుల్లో కొందరినైనా కాపాడేందుకు, మరికొంతమందిలో అవగాహన తెచ్చేందుకు లైఫ్ ఎగైన్ తరఫున చేస్తోన్న ఈ ప్రచారం ఉపయోగకరంగా ఉంటుందని క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న వారికి సాయం చేసేందుకు, ప్రజలలో అవగాహన పెంచేందుకు ముందుకు వచ్చిన గౌతమి, హైమారెడ్డిల కృషి విజయవంతమవ్వాలని కార్యక్రమానికి కువైట్ లోని ప్రవాసులందరూ హాజరకావాలని కోరుకుంటూ హృదయపూర్వక అభినందనలతో కువైట్ ఎన్నారైస్.

మరన్ని వివరాలకోరకు  

వెంకట్ కోడూరి - +965 6686 0966 

వినయ్ కుమార్ ముత్యాల- +965 9965 0479

Wisdom: +965 9882 1465

Emails: venkatk@lifeagainfoundation.org

              vinaym@lifeagainfoundation.org     గౌతమి, శోభన, కువైట్ లో శోభన మరియు గౌతమి