సౌదీలో అమ్నెస్టీ క్షమాబిక్ష ఉపయోగించుకొనే ఆంధ్ర వారికి ప్రభుత్వం సహాయ సహకారాలు... ప్రతేక ఉచిత విమాన సర్విసుల యోచన...

Header Banner

సౌదీలో అమ్నెస్టీ క్షమాబిక్ష ఉపయోగించుకొనే ఆంధ్ర వారికి ప్రభుత్వం సహాయ సహకారాలు... ప్రతేక ఉచిత విమాన సర్విసుల యోచన...

  Sun Apr 02, 2017 20:46        APNRT, సౌదీ అమ్నెస్టీ (క్షమాబిక్ష), Gulf News, Helping Hand, Kuwait, Telugu

సౌదీలో మార్చ్ 29 నుండి అమ్నెస్టీ ని అమలు చేసారు. 90 రోజులదాకా ఈ క్షమాభిక్ష ను అక్రమంగా నివసిస్తున్న తెలుగువారు సద్వినియోగ పరుచుకునే అవకాశం ఉంది. అయితే ఏంతో మంది తెలుగు ప్రవాసులు ఎంబసీ వద్ద దరఖాస్తు చేసుకుంటున్నారు కాని వారి తదుపరి కార్యక్రమ ఏంటి అన్నది ఎవరికీ అంతు బట్టడం లేదు, క్షమాభిక్ష లభిస్తే వెంటనే విమానం ఎక్కాలి.. ఎలా??  ఖర్చులకి కాణీ పైసా లేదు, ఇన్నాళ్ళు ఎలాగోలా గడిపాము ఇక ఇదొక మంచి అవకాశం సద్వినియోగ పరుచుకోవాలి అంటే చేతులు ఖాళీ అన్న వ్యధతో ఉన్నారు సౌదీ లోని తెలుగు ప్రవాసులు. ఎపి ఎన్నార్టీ ఈ నేపధ్యంలో పరిస్థితులకి అనుగుణంగా ఏమేరకు సహకారం అందించాగాలమో ఆ మేరకు సహాయపడాలని యోచిస్తోంది. తెలుగు ప్రవాసులకి అండగా తిరిగి రావడానికి ఆర్ధిక సహాయమా లేక ప్రతేక విమానాలు వేసి ఇరస్త్రానికి తీసుకు రావడమా, అలాగే ఇక్కడికి వాచక వారికీ ఉద్యోగ సహాయమా లేక ఇంకేమన్నానా అన్నది పరిధుల మేరకు, సహాయం కోరిన వ్యక్తీ అర్హతని బేరీజు చేసుకుని నిర్ణయం తీసుకోవాలని ఎపి ఎన్నార్టీ మరియు AP ప్రభుత్వం అభిప్రాయపడుతోంది.

ఏది ఏమయినా సౌదీ ప్రభుత్వం అమ్నెస్టీ ప్రవేశపెట్టడం హర్షించతగ్గ విషయమని, తప్పక తమ సహాయసహకారాలు ప్రవాసులకి ఉంటాయని, పూర్తీ వివరాలు తొందరలో తెలియజేస్తామని APNRT CEO శ్రీ రవి కుమార్ వేమూరి మరియు AP ప్రభుత్వ అధికారులు తెలిపారు.

అలాగే తెలంగాణ ప్రభుత్వం కూడా ముందుకు రావాలని పలు తెలంగాణ NRI లు విన్నపాలు చేస్తున్నారు.

తాజా లెక్కల ప్రకారం ఈ రోజు వరకు 7,000 మందికి పైగా EC (exit clearance ) కొరకు దరకాస్తులు చేసుకున్నారని, 1,000 మందికి పైగా EC లు జారి చేసారని సౌది లోని APNRT కో అర్దినేటర్స్ శ్రీ రాధా కృష్ణ గారు, అంథోని గారు, భాస్కర రావు గారు తెలిపారు.  ఈ క్షమా బిక్ష సమయం లో ఎవెరికైనా ఏదైనా సహాయ సహకారాలు కావలిస్తే వీరికి సంప్రదించి వివరాలు తెలుసుకోవలసినది గా వీరు ఒక ప్రకటనలో తెలియ చేసారు...

AP రాష్ట్రము నుండి సహాయం పొందగోరే వారు విధిగా వీరిని సంరదిస్తే మును ముందు ప్రభుత్వం నుండి సహాయం పొందుటకు అవకాసం ఉంటుంది కాబట్టి మీరు లేకపోతె మీ స్నేహితులు, బంధువుల కు తప్పకుండ ఈ సమాచారాన్ని చేరవేసి లేదా షేర్ చేసి వారికీ ఉపయోగ పడే విధం గా సహకరించాలని కువైట్ ఎన్నారైస్ నుండి ప్రార్ధన మరియు విన్నపం...   AP ప్రభుత్వం, సౌదీలో అమ్నెస్టీ క్షమా, exit clearance