పాలతో మెదడుకు మేలు

Header Banner

పాలతో మెదడుకు మేలు

  Fri Mar 31, 2017 21:34        Health, Telugu

నిత్యం మానసిక ఒత్తిడితో బాధపడుతున్నా రా..? జ్ఞాపకశక్తిలేమి మిమ్మల్ని ఇబ్బందిపెడుతోందా..? అయితే మర్చిపోకుండా రోజూ పాలు తాగడం మంచిదని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ఎముకలు, కండరాలకు పాలు శక్తినిస్తాయని తెలుసు కానీ ఇదేంటీ ఎక్కడా వినలేదని ఆశ్చర్యపోవద్దు. శాస్త్రవేత్తల తాజా అధ్యయనం ప్రకారం.. పాలతో మెదడు ఆరోగ్యంగా, చురుగ్గా ఉంటుందని, ఒత్తిడిని దూరం చేస్తుందని తేలింది. దాంతోపాటూ భవిష్యత్తులో అల్జీమర్స్‌, పార్కిన్సన్‌ తదితర వ్యాధులు వచ్చే ప్రమాదాన్నీ తగ్గిస్తాయి. ఈమేరకు యూనివర్సిటీ ఆఫ్‌ కాన్సస్‌ పరిశోధకులు జరిపిన ఒక అధ్యయనంలో రోజూ పాలు తాగే వారి మెదడులో గ్లుటాథియాన్‌ అనే యాంటీఆక్సిడెంట్‌ స్థాయిలు పెరుగుతున్నాయని తేలింది. దీంతో మెదడు ఆరోగ్యంగా, చురుగ్గా ఉంటుందని వారు వివరిస్తున్నారు.   Milk-good-for-Mind