సౌదీలో నిన్నటినుండి ప్రారంభం అయిన అమ్నెస్టీ- ఎపి ప్రభుత్వానికి ఎపి ఎన్నార్టీ ప్రతిపాదన

Header Banner

సౌదీలో నిన్నటినుండి ప్రారంభం అయిన అమ్నెస్టీ- ఎపి ప్రభుత్వానికి ఎపి ఎన్నార్టీ ప్రతిపాదన

  Thu Mar 30, 2017 13:05        APNRT, సౌదీ అమ్నెస్టీ (క్షమాబిక్ష), Gulf News, Telugu

సౌదీలో నిన్నటినుండి ప్రారంభం అయిన అమ్నెస్టీ- ఎపి ప్రభుత్వానికి ఎపి ఎన్నార్టీ ప్రతిపాదన

సౌదీలో 29 నుండి వలసదారులకు పాస్పోర్ట్ లేక అక్రమంగా ఉంటున్నవారికి, పారిపోయిన వారిని వారి స్వదేశాలకు వేల్లవచ్చని సౌదీ అమ్నెస్టీ (క్షమాభిక్ష) రెండు సంవత్సారాల తరువాత మరల ప్రవేశపెట్టింది. జెడ్డాలో ఇండియన్ ఎంబసీ దగ్గర వేలాది మంది భారత ప్రవాసులు నిన్న దరఖాస్తు చేసుకున్నారు. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగ పరుచుకునేందుకు గాను భారత సౌదీ ఎంబసీ సుదూర ఎడారి ప్రాంతాలలో కూడా తమ తాత్కాలిక కార్యాలయాలను ప్రారంభించింది. సత్వర పాస్పోర్ట్ లను జారీ చేయడానికి గాను సిబ్బంది పని వేళలు కూడా పెంచింది. తమ సిబ్బంది 24 గంటలు పని చేస్తారని భారతీయ కాన్సులేట్  జనరల్ నూర్ రహేమాన్ షేక్ తెలిపారు. తాత్కాలిక పాస్పోర్ట్ ఇమ్మిగ్రేషన్ అధికారులకు అందజేసేప్పుడు వేలిముద్రలను కూడా సమర్పించాలి. అప్పుడు తనిఖీ ప్రక్రియ ప్రారంభం అవుతుంది అన్నీ సరిపోయాయి అనుకున్న పిమ్మట అధికారులు సౌదీ విడిచి వెళ్ళడానికి అనుమంతిస్తారు.

దౌత్య కార్యాలయవడ్డ ఎపి ఎన్నార్టీ ప్రతినిధులు రావి రాధాకృష్ణ, అంథోని రేవల్, జెద్దా తెలుసు సంఘం అధ్యక్షుడు మొహమ్మద్ యూసఫ్ తెలుగు వారికి దరఖాస్తు చేసుకునే ప్రక్రియలో సహకారం అందించడం విశేషం రియాద్ నగరంలో తెలుగువారే ఎక్కువగా దరఖాస్తు చేసుకోడం జరిగింది అని వీరు అన్నారు. సౌదీలో తెలిసో తెలియకో అక్రమంగా నివసిస్తున్న తెలుగువారు ఎక్కువ ఉన్నారని వీరందరికీ ఇలా సౌదీ అమ్నెస్టీ అవకాశం కల్పించడం సంతోషించాతగ్గా విషయం అని వారు సౌదీ ప్రభుత్వం అమ్నెస్టీ విదానాన్ని కొనియాడారు. అయితే ఇక్కడ అక్రమంగా నివసిస్తున్న వారు ఉద్యోగాలు లేక, కనీసం తినడానికి కూడా లేని వాళ్ళు ఉన్నారు. మరి ఈ క్షమాభిక్ష వారికి ఎంతవరకు ఆడుకోగలదు అన్నది ప్రశ్నార్థకమే. ఎందుకంటే సౌదీ ప్రభుత్వం ఎవరి టికెట్ ఖర్చు వారే భరించాలి అని తెలిపింది. వారు ఎక్కడ అప్పులు చేయగలరు? తినడానికే లేని వాళ్ళు ఇక టికెట్ ఖర్చు ఎలా భరించగాలు అని ఎప్ ఎన్నార్టీ ప్రతినిథులు విచారిస్తున్నారు. సౌదీనుండి వచ్చే ప్రవాసులకి ఎపి ప్రభుత్వం టికట్ విషయంలో ఒకసారి ఆలోచించవలసి ఉంది అని ఎపి ఎన్నార్టి ప్రతినిథులు ప్రతిపాదిస్తున్నారు.


   apnrt,soudi,amnesty,started yesterday