వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారు నిర్వహించిన 22వ ఉగాది ఉత్తమ రచనల పోటీ ​విజేతల ప్రకటన

Header Banner

వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారు నిర్వహించిన 22వ ఉగాది ఉత్తమ రచనల పోటీ ​విజేతల ప్రకటన

  Thu Mar 30, 2017 12:02        Associations, Rachanalu (రచనలు), Telugu

"శ్రీ హేవళంబ నామ సంవత్సర ఉగాది (మార్చ్ 28, 2017) సందర్భంగా వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారు నిర్వహించిన 22 ఉగాదిఉత్తమ రచనల పోటీ లో ఈ క్రింది రచనలు ఉత్తమ రచనలుగా ఎంపిక కాబడ్డాయి. విజేతలందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు.విదేశాలలో ఉన్న తెలుగు వారికే పరిమితమైన ఈ అమెరికా, ఆస్ట్రేలియా. మధ్య ప్రాచ్య దేశాలు, ఇంగ్లండ్, కెనడా, ఆస్ట్రేలియా దేశాల నుంచి తగిన సంఖ్యలో ఔత్సాహిక రచయితలు, ప్రముఖ రచయితలూ పాల్గొనడం ముదావహం. ఈ పోటీలో పాలు పంచుకుని, విజయవంతం చేసినరచయితలకు మా ధన్యవాదాలు. అన్ని రచనలకూ సర్వహక్కులూ రచయితలవే. బహుమతి పొందిన రచనలూ, ప్రచురణార్హమైన ఇతర రచనలు కౌముది.నెట్ అంతర్జాల పత్రిక లోనూ, ‘మధురవాణి’, ఇతర పత్రికలలోనూ ఆయా సంపాదకుల నిర్ణయానుగుణంగా ప్రచురించబడతాయి.

ప్రధాన విభాగం22 సారి పోటీ

ఉత్తమ కథానిక విభాగం విజేతలు

శరణం గచ్ఛామి”- సత్యం మందపాటి (ఆస్టిన్)  ($116 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం)

మొగమాటస్థుని డైరీ నుండి- గరిమెళ్ళ నారాయణ (Herndon, VA)  ($116 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం)

గుర్తింపు”- నిర్మలాదిత్య (Tampa, FL)  (ప్రశంసా పత్రం)

ఉత్తమ కవిత విభాగం విజేతలు

అతడిని నాకు తెలుసుడా. గరిమెళ్ళ నారాయణ (Hendon, VA): ($116 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం)

“వెలితి- పన్నాల రఘురాం Rokokoma, NY ($116 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం)

“అద్వైతం” డా. జొన్నలగెడ్డ మూర్తి (ఇంగ్లండ్)  (ప్రశంసా పత్రం)

“మొగలి రేకులు” -రమాకాంత్ రెడ్డి (Melbourne, Australia) (ప్రశంసా పత్రం)

మొట్టమొదటి రచనా విభాగం” -8 సారి పోటీ

 "నా మొట్ట మొదటి కవిత” విభాగం విజేతలు

“నవ సంవత్సరాగమనం” – నేమాని సోమయాజులు(Atlanta, GA) ($116 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం)

“హంపీ వైభవం”- శ్రద్ధ కొమాండూరి (Harrisburg, PA) (ప్రశంసా పత్రం)

“నా మొట్టమొదటి కథ” విభాగం విజేతలు

“గోంగూర పురాణం” – ఉమా (వెంకట్ నాగం) (Sacramento, CA): ($116 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం)

“ఆ నవ్వుకి అర్థం అదా?”  – శ్రీకాంత్ విహారి  (Edison, NJ):  ప్రశంసా పత్రం

విజేతలకు మరొక్క సారి అభినందనలతో

భవదీయులు

వంగూరి చిట్టెన్ రాజు (అధ్యక్షులు), శాయి రాచకొండ (సంపాదకులు)


   association ,vanguri foundation,ugadi wishes