అబుదాబి హిందూ దేవాలయంలో దుబాయ్ షేక్ మరియు వారి బార్య కనబరిచిన మతసామరస్యం

Header Banner

అబుదాబి హిందూ దేవాలయంలో దుబాయ్ షేక్ మరియు వారి బార్య కనబరిచిన మతసామరస్యం

  Tue Mar 28, 2017 14:34        Devotional, Gulf News, Telugu

అబుదాబి హిండుదేవాలయంలో దుబాయ్ షేక్ మరియు వారి బార్య కనబరిచిన మతసామరస్యం

“హిందువుల కోసం అబుదాబిలో మొదటిసారిగా ఓ దేవాలయాన్ని నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది నాటికి ఈ నిర్మాణం పూర్తికానుంది”. అని అక్టోబర్ లో కువైట్ ఎన్నారైస్ లో ప్రచురించిన విషయం విదితమే. అనుకున్నట్లుగానే ఈ నిర్మాణం పూర్తీ అయింది. షేక్ మహమ్మద్ మాట నిలబెట్టుకున్నారు. లెక్కల ప్రకారం 26లక్షల మంది భారతీయులు యూఏఈలో జీవనం సాగిస్తున్నారు వారికి ఈ దేవాలయం ఒక వరం లాంటిది. అంతకన్నా ముఖ్యంగా చెప్పుకోవాల్సినది హిందూ మతానికి షేక్ మరియు వారి కుటుంబ సభ్యులు ఇచ్చిన గౌరవం, గుడి ప్రారంభసమయంలో జరిగిన పూజా కార్యక్రమాలకు దుబాయ్ సుల్తాన్ బార్య హిందువుల పవిత్ర గ్రంధం అయిన రామాయణాన్ని తన తలపై పెట్టి తీసుకురావడం ఒక విశేషం అయితే షేక్ పూజ జరుగుతున్నసేపు దీపపు పళ్ళెం తన చేతులతో పట్టుకుంది ఆ పూజని మనసారా ఆస్వాదించడం. అన్ని మతాల సారం ఒకటే మతగ్రందాల తాత్పర్యం ఒక్కటే సర్వేజనా సుఖినోభవంతూ అని అలా దేవుడుముందు రాజయినా పెదయినా ఈ మతమయినా ఒకటే అని తెలియజెప్పే విధంగా ఉన్న  ఈ దృశ్యాలని మీరు తిలకించండి. మనసు పులకరించక మానదు. ఎక్కడయినా ఎవరి దేవుడయినా అదే పూజ అదే ప్రార్థన, అదే నమాజ్, అదే ప్రేయర్ పద్ధతులు మాత్రమె మారతాయి. ఇలాంటి సంఘటనలు మనసుని తాకుతాయి. మనసార హిందువులయిన మనమందరం దుబాయ్ షేక్ కి, దుబాయ్ సుల్తానా బార్యకి వారి మతసామరస్యానికి ఒకసారి తలవంచి వందనం చేద్దాం. జోహార్లు మీకు.

****

కువైట్ ఎన్నారైస్ లో ప్రచురించిన వార్త మరల ఇంకోసారి పాఠకుల సౌలభ్యం కోసం.

హిందువుల కోసం అబుదాబిలో మొదటిసారిగా ఓ దేవాలయాన్ని నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది నాటికి ఈ నిర్మాణం పూర్తికానుంది. అబుదాబిలో ప్రభుత్వం ఈ గుడి నిర్మాణానికి కావల్సిన స్థలాన్ని ప్రభుత్వం వితరణగా ఇచ్చింది. సోమవారంనాడు అధికారికంగా ఈ భూమిని అప్పగించింది. వేలాది మంది హిందువులు నివసిస్తున్న అబుదాబిలో భారత ప్రధాని నరేంద్రమోదీ గత ఏడాది పర్యటించిన నేపథ్యంలో ఈ గుడి నిర్మాణం తెరమీదకొచ్చింది. ఇందుకు అవసరమైన భూమిని కేటాయిస్తామని అబుదాబీ ప్రభుత్వం ఆ సందర్భంలో ప్రకటించింది. ఈ నేపథ్యంలో అబుదాబి నగరం వెలుపల ఆల్‌ వాత్బాలో 20,000 చదరపు మీటర్ల స్థలాన్ని ప్రభుత్వం మంజూరు చేసినట్టు భారత్‌కు చెందిన వ్యాపారవేత్త, ఎన్ఎంసి హెల్త్‌కేర్ అండ్ యూఏఈ ఎక్స్చేంజ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారి బీఆర్ శెట్టి తెలిపారు. టెంపుల్ కో-ఆర్డినేషన్ కమిటీ చైర్మన్‌గా కూడా ఆయన ఉన్నారు. అబుదాబీ సిటీ నుంచి అల్ వాత్బా 30 నిమిషాల జర్నీ ఉంటుందని, ప్రభుత్వం కేటాయించిన స్థలంలో ఏడాదిలోగా హిందూ ఆలయ నిర్మాణం జరుపుతామని, ఏడెనిమిది నెలల్లో కూడా పూర్తయ్యే అవకాశం ఉందని అన్నారు. ఆలయం లోపల శ్రీకృష్ణుడు, ఈశ్వరుడు, అయ్యప్ప తదితర దేవుళ్ల విగ్రహాలు ఉంటాయన్నారు. ఇప్పటి వరకూ ఆలయ నిర్మాణానికి అనుమతి మాత్రమే రాగా, సోమవారంనాడు భూమి కేటాయింపు జరిగిందని చెప్పారు. ప్రస్తుతం దుబాయిలో మాత్రమే రెండు హిందూ ఆలయాలు, ఒక సిక్కు గురుద్వారా ఉన్నాయి. అబుదాబిలో భారత రాయబార కార్యాలయం లెక్కల ప్రకారం 26లక్షల మంది భారతీయులు యూఏఈలో జీవనం సాగిస్తున్నారు.


   hindhu temple in gulf,temple,king,kuwiatnris