గల్ఫ్ లో మారిన వాతావరణ పరిస్థితులు ... ప్రమాదం లో చిక్కుకున్న విమానం

Header Banner

గల్ఫ్ లో మారిన వాతావరణ పరిస్థితులు ... ప్రమాదం లో చిక్కుకున్న విమానం

  Mon Mar 27, 2017 12:30        Environment, Gulf News, Social Network Hal Chal, Telugu

గల్ఫ్ లో మారిన వాతావరణ పరిస్థితులు ... ప్రమాదం లో చిక్కుకున్న విమానం

వేషమూ మార్చెను, భాషని మార్చెను, మోసం నేర్చెను తలలే మార్చెను.. అయినా మనిషి మారలేదు ఆతని కాంక్ష తీరలేదు అన్నాడో కవి. అలాగే ఎంతటి సాంకేతిక పరిజ్ఞానం ఉన్నా ఎన్ని పరికరాలు కనుగొన్న , ఎంతటి ఘనకీర్తి సాధించినా ప్రకృతి విలయతాండవం ముందు అవన్నీ తృణప్రాయాలే. దానికి ఉదాహరణ ఈ సంఘటన గల్ఫ్ దేశాలయిన దుబాయి, కువైట్, అబుదబీ, షార్జాహ్.. వంటి గల్ఫ్ ప్రాంతాల్లో ఒక్కసారిగా వాతావరణ పరిస్థితులు మారిపోయి వర్షాలు వస్తుండటం అందరికి విదితమే మరో రెండు రోజులు ఇదే పరిస్థితి ఉండే అవకాశం ఉందని గల్ఫ్ వాతావరణ శాఖ చెబుతోంది. ఈ సమయంలో ివిమానాలు రద్దు చేస్తారు కాని ఆదివారం ఉదయం ఓ అనుకోని సంఘటన జరిగింది. వాతావరణ పరిస్థితుల వల్ల వీస్తున్న బలమైన గాలుల కారణంగా ప్రయాణంలో ఉన్న ఓ విమానం కాసేపు కుదుపులకు గురైంది. దాంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళన చెందారు. సౌదీలోని అల్‌బాహ నుంచి జేడ్డా విమానం వెళ్తుండగా ఈ పరిస్థితి ఎదురైంది. అదృష్టవశాత్తూ ప్రాణనష్టం ఏమి జరగలేదు కాని విమానంలో ఉన్న ఓ ప్రయాణీకుడు తన మొబైల్ లో ఈ విమాన కుడుపులని చిత్రీకరించి సోషల్ మీడియాలో షేర్ చేసాడు. ఇప్పుడీ వీడియో నేటిజన్స్ లో ప్రభంజనం సృష్టిస్తోంది. వీడియో మీరు ఒకసారి చూడండి.   in gulf social media,flight ,safe ,social media