శ్రీమతి కళా ఇంద్ర రాజు గారికి కువైట్ ఎన్నారైస్ తరుపున పుట్టినరోజు శుభాకాంక్షలు

Header Banner

శ్రీమతి కళా ఇంద్ర రాజు గారికి కువైట్ ఎన్నారైస్ తరుపున పుట్టినరోజు శుభాకాంక్షలు

  Mon Mar 27, 2017 10:53        Kuwait, Telugu, Wishes (శుభాకాంక్షలు)

శ్రీమతి కళా ఇంద్ర రాజు గారికి కువైట్ ఎన్నారైస్ తరుపున  పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న కళా ఇంద్ర రాజు గారికి జన్మదిన శుభాకాంక్షలను తెలియజేస్తూ… వీరు ఎప్పుడు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్య ఐశ్వర్యాలతో కలకాలం చిరంజీవిగా నిలవాలని, ఇలాంటి వసంతాలను ఎన్నో ఎన్నెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నారు కుటుంబ సభ్యులు మరియు బంధుమిత్రులు.
ఈ సందర్భంగా కళా ఇందర్ రాజు గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలను తెలియజేస్తూ… వీరు ఇలాంటి పుట్టిన రోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని… చెరగని చిరునవ్వుతో, ఆత్మీయుల ప్రేమాభిమానాలతో, జీవితంలో ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, మీకు ఆ భగవంతుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని, ఆనందోత్సాహాలతో కలకాలం కమనీయ జీవితాన్ని గడపాలని కోరుకుంటూ… హృదయపూర్వక శుభాకాంక్షలను తెలియజేస్తుంది మీ కువైట్ ఎన్నారైస్.

అంతరిక్షం ఎత్తు తెలియకపోయినా,

సాగరలోతు తెలిసినా,

స్త్రీ మనసు తెలుసుకోవడం సాధ్యంకాదు.

తెలిసిందనిపించి, తెలియకుండా పోయేది వేదాంతం!

స్త్రీ మనసు అలాటిది. అంతా తెలిసిందనిపిస్తుంది, మగవాడికి,

అది నిజంకాదు, వేదాలు చదివినా, వేదాంతం తెలియనట్లే,

స్త్రీ హృదయం తెలిసిందనుకోవడం, ఆకాశం, అంతరిక్షం, హద్దులు వెతకడమే!

స్త్రీ శక్తి, చాతుర్యం, అలాటిది మరి!

అలాంటి శక్తి చాతుర్యం తో

ప్రతి అడుగు విజయపదమై

అడుగుని ఆపుతున్న అవరోధాలని సైతం

గెలుపుకి సోపానంగా చేసుకుని

అలజడి రేపే ఆలోచనలనే

ఆఖరి గమ్యంగా నిర్దేశించుకుని

అలుపెరగని బాటసారిగా

కన్నీరుని సైతం చేతి స్పర్శతో

చిరునవ్వుగా మార్చుకుని

తలపెట్టే ప్రతి పనిలో

విజయ బాహుటా ఎగురవేస్తూ

సాగుతున్న

శ్రీమతి కళా ఇందర్ రాజుగారికి

కువైట్ ఎన్నారైస్ తరుపున

పుట్టినరోజు శుభాకాంక్షలు.

మీరు ఇలాంటి పుట్టినరోజులు

మరెన్నో జరుపుకోవాలని

మనసారా  ఆకాంక్షిస్తూ

మీ అభిమాన కువైట్ ఎన్నారైస్.

 

ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న కళా గారికి జీవిత భాగస్వామి అయిన ఇంద్ర రాజు గారు  శుభాకాంక్షలు ఈ విదంగా తెలుపుతున్నారు.

నా ఇంటిదీపానికి జన్మదిన శుభాకాంక్షలు

 

నీకు నాకు అసలు ఏ సంబధం ఉందని?

కేవలం తాళి కట్టించుకున్నదుకు నాతో కలిసి నడిచావు

నా కష్టసుఖాలను నీవిగా చేసుకున్నావు.

మన ఇద్దరికీ రక్తసంబంధం ఏది?

అయినా ప్రేమబంధంతో అక్కున చేర్చుకున్నావు

అన్ని వదిలేశావు అందరిని వదిలేశావు

ఆఖరికి ఇంటిపేరుతో సహా..

నా ఇంటిపేరుని ఆభరణంగా తగిలించి

నా ఇంటికే దీపం అయ్యావు.

ప్రేమనే నూనెగా చేసి,

వాత్సల్యాన్ని వత్తి మార్చి

నా జీవితానికి వేలుగయ్యావు.

ఎవరివి నీవు?

చిత్రకారుల కుంచెకు చిక్కని అందానివా?

కవుల ఊహకి చిక్కని భావానివా?

వెన్నెల వాగులో నాకోసం ఎదురు చూసే నక్షత్రానివా?

ఖండాలు దాటి నాతో వచ్చిన కోహినూరు వజ్రానివి నువ్వు

నీ నవ్వులో నైలునది వంపుల బేరం ఆడుతోంది.

నీ కళ్ళ తీరాలు కూడా దాటి పక్కకి చూడలేని నన్ను

నీ కలల సునామీలో చిక్కుకునేలా చేస్తున్నావు.

హహహ కళా! నీకో విషయం చెప్పనా..

నా కళ్ళు చేసుకున్న పుణ్యమో

కలలు రాసుకున్న కావ్యమో

అందం నీ దగ్గర పాఠాలు వల్లెవేస్తోంది.

నా చూపు నీ దగ్గర కొత్త సోయగాలని అద్దుకుంటోంది..

అందాల తాజ్ మహల్ దగ్గర మహారాణిలా కూర్చుని

నువ్వు చిరునవ్వులు చిందిస్తున్నప్పుడు

ఎవరందంగా ఉన్నారంటే ఏమని చెప్పను?

నాలో చేలరేగే భావాలని వ్యక్తీకరించడానికి నా భాష చాలడం లేదు

నిన్ను వర్ణించడానికి శ్రీనాధుడు , కీట్స్ కలిసి రావాలేమో

వేకువ వనాలలో వసంత సమీరమా

ప్రకృతిని చొసి నీ మనసు రాగామాలపిస్తున్నప్పుడు

చినుకులతో కలిసి నీ పాదాలు తాళం వేసినప్పుడు

అమాయకత్వంలో  అతిశయంలో చిలిపితనపు అల్లరి వేళల్లో

నీ రూపాన్ని నా కళ్ళలో నిలిపిన క్షణాల్ని నేనెలా మర్చిపోగలను కళా.

నాలోని అలసిన బాటసారికి ఆఖరి మజిలీ నీ నవ్వు

తలపుల తుఫాన్ లో తడిసి

కాసింత వెచ్చదనం కోసం నీ ఊహల వాకిలిలో నిలిచి

నీ కోసం కేవలం నీకోస పుట్టిన నేను

నీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపాలని

నీ మనసు వాకిట నిలుచున్నా..

కనురెప్పల దోప్పలపై స్వప్నలేఖ రాస్తూ

శుభాకాంక్షలు చెప్తున్నా

కనిపించే అందమంతా శాశ్వతమని అనుకోను

మనసు చెలిమి కావాలని స్నేహలేఖ రాస్తున్నా

చరిత్రలో నిలిచిపోవు కావ్యలేఖ రాస్తూ

నీకు శుభాకాంక్షలు చెప్తున్నా

మాటలలో చెప్పలేక మౌనాక్షరమయ్యాను

గుండెలోని భావాలను చూపు లేఖ రాస్తున్నా

పుట్టినరోజు శుభాకాంక్షలు నా అర్థాంగికి,

నా జీవిత భాగస్వామికి,

నా జీవితానికి

నా ఇంటి దీపానికి

నా కళా ఇందర్ రాజ్ కి

ప్రేమతో

నీ స్వీట్ హార్ట్

ఇంద్ర    whishes,indra raju,kuwiat nris,whishes from kuwait nris