కువైట్ లో ఉగాది కానుకగా 121 షో లతో విడుదల కానున్న మెగా పవర్ మూవీ ‘కాటమరాయుడు’

Header Banner

కువైట్ లో ఉగాది కానుకగా 121 షో లతో విడుదల కానున్న మెగా పవర్ మూవీ ‘కాటమరాయుడు’

  Thu Mar 23, 2017 14:14        Telugu, Cinemas in Kuwait, Kuwait

కువైట్ లో ఉగాది కానుకగా 121 షో లతో విడుదల కానున్న మెగా పవర్ మూవీ ‘కాటమరాయుడు’

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, శృతిహాసన్ జంటగా నటించిన తాజా సినిమా ‘కాటమరాయుడు’. పవన్ అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. తమిళ సినిమా ‘వీరం’ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాకు కిషోర్ కుమార్ పార్దసాని (డాలీ) దర్శకత్వం వహించారు. పవన్ సన్నిహిత మిత్రుడు శరత్ మరార్ ఈ సినిమాను నిర్మించారు. అలీ, రావు రమేష్, నాజర్, శివబాలాజీ, ప్రదీప్ రావత్, కమల్ కామరాజు, అజయ్ ఇలా భారీ తారగణంతోనే సినిమా తెరకెక్కింది. 

‘సర్దార్ గబ్బర్ సింగ్’ నిరాశపరచడంతో పవన్ అభిమానులు ‘కాటమరాయుడు’ పైనే ఆశలు పెట్టుకున్నారు. ‘గోపాలా గోపాలా’ హిట్ అందించిన డాలీ కచ్చితంగా ‘కాటమరాయుడు’ని బాగా తీసుంటారని అభిమానులు అనుకుంటున్నారు. గబ్బర్‌సింగ్‌లో పవన్ కల్యాణ్‌తో జోడికట్టిన శ్రుతిహాసన్ కాటమరాయుడులో కూడా పవన్ కి  జంటగా నటించింది. రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంగా రూపొందుతున్న ఈ చిత్రం కధ ‘కాటమరాయుడు’కి ఆధారమైన ‘వీరం’ సినిమా ఇప్పటికే ‘వీరుడొక్కడే’ పేరుతో తెలుగు డబ్ కావడం కొంత కలవరపెట్టే విషయం. ఇప్పటికే ‘వీరుడొక్కడే’ సినిమా చూసిన యాంటి ఫ్యాన్స్ ‘కాటమరాయుడి’పై బురద చల్లే అవకాశం కూడా ఉంది. కానీ ‘కాటమరాయుడు’ని మన ప్రాంతీయతకు తగ్గట్టు పూర్తిగా మార్చేసినట్లు సమాచారం. పక్కా ఫ్యాక్సనిస్టు కథకు లవ్ స్టోరీని జతచేసి డాలీ ‘కాటమరాయుడు’ని అద్భుతంగా తెరకెక్కించినట్లు ఫిల్మ్‌నగర్ టాక్.

పవర్ స్టార్ కాటమరాయుడిగా థియేటర్లలో సందడి చేసేందుకు మరో రోజు మాత్రమే ఉంది భారీ అంచనాల మధ్య పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన కాటమరాయుడు చిత్రం మార్చి 24న (శుక్రవారం) విడుదలయ్యేందుకు సిద్ధమవుతున్నది. ఈ చిత్రానికి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్ అప్పుడే మొదలు కాగా దానికి అనూహ్య స్పందన కనిపిస్తున్నట్టు సమాచారం.

ఆన్‌లైన్ మూవీ టికెట్స్ వెబ్‌సైట్ల నిర్వాహకులు మీడియాతో మాట్లాడుతూ.. కాటమరాయుడు టికెట్లు హాట్‌కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. సినీ అభిమానుల నుంచి అడ్వాన్స్ బుకింగ్ భారీ స్పందన కనిపిస్తున్నది అని తెలిపారు.
‘కాటమరాయుడు’ చిత్రానికి సంబంధించిన థియేటర్ ట్రేలర్ విడుదలవ్వడం తో బుకింగ్‌‌కు భారీ స్పందన రావడం వల్లనే అడ్వాన్స్ బుకింగ్‌కు స్పందన బాగా వచ్చిందని అభిప్రాయం వ్యక్తం చేసారు.

ఫస్ట్ షో చూడాలనే అభిమానుల్లో కొందరికి టికెట్లు దొరకక నిరాశకు గురైనట్టు తెలుస్తున్నది. మొదటి ఆట పక్కన పడితే. తొలి రోజు టికెట్లు దొరకలేదని, దాంతో రెండో రోజుకు టికెట్ బుక్ చేసుకొన్నానని ఓ సినీ అభిమాని ఆవేదన వ్యక్తం చేశారు.

కువైట్ లో తమ అభిమాన హీరో పవర్ స్టార్ పవన్ ‘కాటమరాయుడు’ మూవీ విడుదల అవుతున్న సందర్భంగా పవన్ అభిమానులు ఈ మూవీ కోసం ఎదురుచుస్తున్నారు.

కువైట్ లో ఈ సినిమా ఒక రోజు ముందుగా అనగా మర్చి 23 (గురువారం) ఉగాది కానుకగా TGM,TEAMS ,SKYNET,SKYMART ద్వారా విడుదల కానున్నది.

కువైట్ లోని అజీల్, ఫానార్, ఎవెన్యూస్, మొహలబ్, షర్క్, ప్లాజా, ఆల్ కూట్ థియేటర్ లలో 121 షో లతో భారీగా విడుదల అవుతున్న ఈ సినిమా టికెట్ ల కోసం ఈ క్రింది నంబర్లను సంప్రదించండి.

భాస్కర్ నాయుడు – 51001544

రత్నం నాయుడు - 55658133

పటాన్ మౌలా – 99484996

శ్రీను, కోట - 55937263

స్కైనెట్ మొబైల్స్ – 97555732

సురేష్ - 55280777 

 

 


   pavan kalyan,katamaraiyudu,in kuwait,pawanisum,