దుబాయ్ లేబర్ లా: కంపెనీ జీతాలు చెల్లించకపోతే ముందస్తు నోటీసు లేకుండా ఉద్యోగం మానేయవచ్చా? లేబర్ లా ఏం చెప్తోంది?

Header Banner

దుబాయ్ లేబర్ లా: కంపెనీ జీతాలు చెల్లించకపోతే ముందస్తు నోటీసు లేకుండా ఉద్యోగం మానేయవచ్చా? లేబర్ లా ఏం చెప్తోంది?

  Thu Mar 23, 2017 11:57        దుబాయ్ న్యాయ సలహాలు, Gulf News, Telugu

ప్రశ్న: నేను ఒక దుబాయ్ కంపనీలో 4 నెలల నుండి పని చేస్తున్నాను. దుబాయ్ లో నా మొట్టమొదటి కాంట్రాక్ట్ ఇది. కాని కంపనీ 3 నెలల నుండి నాకు జీతాలు ఇవ్వడం లేదు. ఇప్పుడు నాకు ఫ్రీ జోన్ కంపనీలో ఆఫర్ ఉంది. కాని నా మొదటి కాంట్రాక్ట్ పూర్తీ అవలేదు నేనేమి చేయాలి, నేను ఫ్రీ జోన్ కంపనీలో జాయిన్ అయి నాకు కాంట్రాక్ట్ కంపనీ నుండి ఎటువంటి సాలరీ రాలేదని నిరూపించుకోవచ్చా?

జవాబు: అంటే మీరు మొట్టమొదటిగా కాంట్రాక్ట్ తీసుకుని నాలుగు నెలలనుండి ఒక కంపెనీలో చేస్తున్నారు, మీకు అందులో మూడు నెలలనుండి జీతాలు లేవు. ఇప్పుడు మీకు ఫ్రీ జోన్ జాబు వచ్చింది. ప్రస్తుతం మీరు నాన్ ఫ్రే జోన్ లో చేస్తున్నారు. ఈ కేసు లేబర్ రిలేషన్స్ (లేబర్ లా) ఫెడరల్ లా 8 1980 కి చెందుతుంది.

ఈ లా ప్రకారం “ఎవరేని కంపెనీ యజమాని  ఉద్యోగులకి జీతాలు ఇవ్వనట్లయితే ఈ లా ని అతిక్రమించినట్లే. ఇలా చేసినప్పుడు అక్కడ పని చేసే ఉద్యోగులు నోటీసు ఇవ్వకుండా ఉద్యోగం మానివేయవచ్చు.అలాగే జీతాలు చెల్లించకుండా కంపెనీ మూసివేయడం కూడా చట్ట ఉల్లంఘనే. ఆర్టికల్ 121 ) ఫెడరల్ లా 8 1980  ప్రకారం వీరు శిక్షార్హులు అవుతారు.

ఆర్టికల్ 121 ) ఫెడరల్ లా 8 1980  ఏమని చెప్తోంది అంటే

“ఉద్యోగి నోటీసు లేకుండా ఉద్యోగం మానేయవచ్చు” ఈ క్రింద ఉదాహరించిన సందర్భాలలో

ఒకవేళ యజమాని కాంట్రాక్టు ప్రకారం జీతాలు చెల్లించనట్లయితే

యజమాని లేదా యజమాని యొక్క ప్రతినిధి కనుక దాడి చేసినట్లయితే

మినిస్ట్రీ అఫ్ లేబర్ వద్ద కేస్ ఫైల్ చేసి కంపనీ జీతాలు ఇవ్వడం లేదని ప్రూవ్ చేసుకుని కాంట్రాక్ట్ రద్దు చేసుకోవచ్చు.


   labor law, dubai labor law, notice prior to resignation, employee resignation