నయా ఐడియాలతో మైక్రో మ్యాక్స్

Header Banner

నయా ఐడియాలతో మైక్రో మ్యాక్స్

  Wed Mar 22, 2017 21:23        Gadgets, Telugu

భారత్‌లో రెండో స్థానంలో కొనసాగిన దేశీ దిగ్గజ మొబైల్ కంపెనీ మైక్రోమాక్స్ మళ్లీ పూర్వవైభవం కోసం ప్రయత్నిస్తోంది. షియోమి, జియోని, ఒప్పో, వివో వంటి చైనా కంపెనీల రాక కారణంగా విపరీతంగా పోటీ పెరిగిపోవడంతో మైక్రోమాక్స్ బాగా వెనకబడిపోయింది. అయితే భారత్‌లో కంపెనీ కోల్పోయిన మార్కెట్‌ను మళ్లీ దక్కించుకోవడానికి తొలిసారి డ్యుయల్ కెమెరా స్మార్ట్‌ఫోన్‌తో మైక్రోమాక్స్ వస్తోంది. ఈ మేరకు తమ డ్యుయల్ కెమెరా ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ ఆవిష్కరణకు రంగం సిద్ధం చేసింది.మార్చి 29న తమ కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేస్తున్నట్లు మీడియాకు ఇన్విటేషన్లు కూడా పంపింది. కంపెనీ అధికారిక ట్విట్టర్ అకౌంట్‌లో కూడా కొన్ని ఇమేజ్‌లు ట్వీట్ చేసింది. ఈ ఇమేజ్‌లతో పాటు, పరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం ఈ కొత్త స్మార్ట్‌ఫోన్‌లో మూడు 13 ఎంపీ కెమెరాలు ఉండనున్నాయి. వీటిలో వెనుకవైపు రెండు కెమెరాలు ఉండగా.. సెల్ఫీల కోసం ఫ్రంట్ షూటర్ ఉంటుంది. మైక్రోమాక్స్ నుంచి వస్తున్న ఈ తొలి డ్యుయల్ కెమెరా స్మార్ట్‌ఫోన్‌ని పూర్తి మెటల్ బాడీతో నిర్మించినట్లు తెలుస్తోంది. అంతకు మించి ఈ ఫోన్‌కు సంబంధించి ఎలాంటి సమాచారం తెలీదు. మైక్రోమాక్స్ ఒక ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌లోకి తీసుకొచ్చి చాలా కాలం అవుతోంది. గతేడాది ఏప్రిల్‌లో కాన్వాస్ 6 ప్రొ పేరుతో ఒక ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌ను మైక్రోమాక్స్ విడుదల చేసింది. దీని ధర రూ. 13,999. అయితే ఇప్పుడు కొత్తగా వస్తున్న స్మార్ట్‌ఫోన్ ఫీచర్లేంటి, ధరెంత అనే విషయాలు తెలియాలంటే మార్చి 29 వరకు ఆగాల్సిందే.   Micromax-in-new-ideas