'స్వర్గం'... గజల్ | మాధవరావు కొరుప్రోలు

Header Banner

'స్వర్గం'... గజల్ | మాధవరావు కొరుప్రోలు

  Wed Mar 22, 2017 14:03        Rachanalu (రచనలు), Telugu

నరుకుట మానిన దొరుకును స్వర్గం..!
చెలిమిని పంచిన మిగులును స్వర్గం..!

రుచులకు ఊయల వేయకు మనసా..
తెలివిని నిలిపిన అందును స్వర్గం..!

పశువులు పక్షుల సౌఖ్యము తలచుము..
ధర్మము కాచిన దక్కును స్వర్గం..!

చూపులకందని వేదం ఉండదు..
తలపులు ఆగిన వెలుగును స్వర్గం..!

శ్వాసను మించిన గురువసలెవ్వరు..!?
సాక్షిగ మారిన విరియును స్వర్గం..!

మాధవ గజలే..మౌనపు కోవెల..
తియ్యగ చేరిన..నిలచును స్వర్గం..!!

 

- మాధవరావు కొరుప్రోలు


   మిగులు,పశువులు,పక్షుల, సౌఖ్యము,స్వర్గం