కార్బన్ నుంచి రెండు బడ్జెట్ స్మార్ట్‌ఫోన్లు.. ఫీచర్లు ఇలా..

Header Banner

కార్బన్ నుంచి రెండు బడ్జెట్ స్మార్ట్‌ఫోన్లు.. ఫీచర్లు ఇలా..

  Tue Mar 21, 2017 21:10        Gadgets, Telugu

దేశీయ మొబైల్ కంపెనీ కార్బన్ తాజాగా రెండు 4జీ మొబైల్స్‌ను విఫణిలోకి విడుదల చేసింది. ఔరా స్లీక్ 4జీ, ఔరా నోట్ 4జీ పేర్లతో విడుదల చేసిన ఈ స్మార్ట్‌‌ఫోన్లు బడ్జెట్ ధరలోనే లభిస్తాయని కార్బన్ పేర్కొంది. ఔరా స్లీక్ 4జీ ఫీచర్లు ఇలా.. ఐదంగుళాల డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ మార్ష‌మాలో, 1 జీబీ ర్యామ్, 8 జీబీ ఇంటర్నల్ మెమొరీ, 32 జీబీ వరకు పెంచుకోవచ్చు. 1.25 గిగాహెడ్జ్‌ క్వాడ్ కోర్ ప్రాసెసర్, 5 ఎంపీ రియర్, 2 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 2ఎంఏహెచ్ బ్యాటరీ కలిగిన ఈ ఫోన్ ధర రూ.5290.
 
 
ఇక ఔరా నోట్ 4జీ ఫీచర్ల విషయానికొస్తే.. 5.5 అంగుళాల డిస్‌ప్లే, 2 జీబీ ర్యామ్, 16 జీబీ ఇంటర్నల్ మెమొరీ, 32 జీబీల వరకు పెంచుకునే వెసులుబాటు, 5 ఎంపీ రియర్, ఫ్రంట్ కెమెరాలు కలిగిన ఈ ఫోన్‌లో 2800 ఎంఏహెచ్ బ్యాటరీ వినియోగించారు. ధర రూ.6,890.


   karbon-phones