'చక్రవర్తి పదవికేమి..నా ప్రాణమె నీవు కదా..!'... గజల్ | మాధవరావు కొరుప్రోలు

Header Banner

'చక్రవర్తి పదవికేమి..నా ప్రాణమె నీవు కదా..!'... గజల్ | మాధవరావు కొరుప్రోలు

  Tue Mar 21, 2017 15:19        Rachanalu (రచనలు), Telugu

చక్రవర్తి పదవికేమి..నా ప్రాణమె నీవు కదా..!

శాసకుడను సరియేలే..నా భావమె నీవు కదా..!

 

మనసు గాక గొప్ప కాన్క..ఉంటుందా ఇచ్చేందుకు..?!

ఈ వేషము దేమున్నది..నా సర్వమె నీవు కదా..!

 

ఈ తవిక ఉండి ఏమి..నీ చెలిమియె దక్కనపుడు..!?

పాలకుడను నిజమేలే..నా హృదయమె నీవు కదా..!

 

సౌందర్యపు లోకాలే..దాచినావు నీ పిడికిట..

రక్షకుడనూ ఎవ్వరికో..నా ధైర్యమె నీవు కదా..!

 

భోగాలకు విలువేమిటి..నీ వెలుగే సోకనపుడు..!?

కర్తనెలా అవుతానట..నా రాజ్యమె నీవు కదా..!

 

ఈ మాధవ గజల్ పాద..మంజీరం ఏమనునిక..!?

కర్మతోటి బంధమేమి..నా సాక్ష్యమె నీవు కదా..!!

 

- మాధవరావు కొరుప్రోలు


   చక్రవర్తి,గొప్ప, కాన్క,శాసకుడ,వేషము,తవిక,పాలకుడ,పిడికిట,రక్షకుడ,కర్తన,తోటి