టాయిలెట్ సీట్‌ కన్నా వీటిపై క్రిములు ఎక్కువ ఉంటాయి..! తెలుసా మీకు? జాగ్రత్తలు తీసుకోండి

Header Banner

టాయిలెట్ సీట్‌ కన్నా వీటిపై క్రిములు ఎక్కువ ఉంటాయి..! తెలుసా మీకు? జాగ్రత్తలు తీసుకోండి

  Sun Mar 19, 2017 19:06        Environment, Life Style, Telugu

టాయిలెట్ సీట్‌పై ఎన్ని వైరస్‌లు, క్రిములు ఉంటాయో తెలుసు కదా..! ఎక్కడ లేని సూక్ష్మ జీవులన్నీ ఆ సీట్‌పైనే ఉంటాయి. అందుకే టాయిలెట్‌ను ఎంత శుభ్రంగా ఉంచుకుంటే మనకు అంత మంచిది. దాని వల్ల మనం అనారోగ్యాల బారిన పడకుండా ఉంటాం. అయితే కేవలం టాయిలెట్ సీట్ మాత్రమే కాదు, అలా వైరస్‌లు, క్రిములు ఎక్కువగా ఉండే ప్రదేశాలు కూడా కొన్ని ఉన్నాయి. అవేమిటంటే...

డోర్ నాబ్స్...
డోర్‌ను బయటకు నెట్టడానికి, లోపలికి లాగడానికి ఉపయోగించే నాబ్స్ తెలుసు కదా. వాటిపై టాయిలెట్ సీట్ కన్నా 60 శాతం అధికంగా క్రిములు ఉంటాయట. ఇక ఆఫీసుల్లోనైతే అవి ఇంకా ఎక్కువ ఉంటాయని సైంటిస్టులు చెబుతున్నారు.
smart-phone
స్మార్ట్‌ఫోన్...
నిత్యం మనం వాడే స్మార్ట్‌ఫోన్‌పై కూడా క్రిములు ఎక్కువగానే ఉంటాయట. టాయిలెట్ సీట్ కన్నా 10 రెట్ల ఎక్కువ క్రిములు స్మార్ట్‌ఫోన్‌పై ఉంటాయని యూనివర్సిటీ ఆఫ్ అరిజోనాకు చెందిన సైంటిస్టులు చెబుతున్నారు.
computer-keyboard
కంప్యూటర్ కీబోర్డ్...
నిత్యం మన టక్ టక్ మంటూ టైప్ చేసే కంప్యూటర్ కీబోర్డుపై ఉండే క్రిముల గురించి తెలిస్తే మీరు షాకవుతారు. అవును, టాయిలెట్ సీట్ కన్నా కంప్యూటర్ కీబోర్డుపై 200 రెట్లు ఎక్కువ క్రిములు ఉంటాయి. దాన్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోకపోతే అనారోగ్యాల బారిన పడక తప్పదు.
washroom-wash-basin
వాష్‌రూమ్ బేసిన్...
వాష్‌రూమ్‌లో ఉండే బేసిన్‌పై టాయిలెట్ సీట్ కన్నా 21 రెట్లు ఎక్కువ బాక్టీరియా, వైరస్‌లు ఉంటాయి. కిచెన్ లో ఉండే నల్లాపై అవి 44 రెట్లు ఎక్కువగా ఉంటాయి. కనుక ఆయా ప్రదేశాలను కూడా బాగా శుభ్రంగా ఉంచుకోవాల్సిందే.

హ్యాండ్ బ్యాగ్...
మహిళలు వాడే హ్యాండ్ బ్యాగ్ కూడా బాక్టీరియా, వైరస్‌లకు నిలయమే. సరిగ్గా శుభ్రం చేసుకోకపోతే హ్యాండ్ బ్యాగ్‌లపై టాయిలెట్ సీట్ కన్నా 100 రెట్లు ఎక్కువ క్రిములు ఉంటాయి.
car-steering
కార్ స్టీరింగ్...
టాయిలెట్ సీట్ కన్నా 700 రెట్లు ఎక్కువ క్రిములు కార్ స్టీరింగ్‌పై ఉంటాయి. కనుక ఏవైనా ఆహార పదార్థాలను కొని కారులో పెట్టుకునేటప్పుడు, తీసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. లేదంటే ఆ ఆహారలోకి బాక్టీరియా ప్రవేశించి వ్యాధులు వస్తాయి.

వాషింగ్ మెషిన్...
మనం బట్టలను ఉతుక్కునే వాషింగ్ మెషిన్‌లో కూడా టాయిలెట్ సీట్‌పై కన్నా ఎక్కువగానే క్రిములు ఉంటాయి. కనుక బట్టలను ఉతికాక వాషింగ్ మెషిన్‌ను కచ్చితంగా శుభ్రం చేయాలి. ఎండ తగిలే ప్రాంతంలో దాన్ని ఉంచితే బెటర్. క్రిములు చనిపోతాయి.   bactiria, door knobs, key bords, smart phones