రాయల్ ఎన్ఫీల్డ్‌ను తలదన్నే ఉత్పత్తుల తయారీకి హోండా టూవీలర్స్... రాయల్ ఎన్ఫీల్డ్‌కు దడ

Header Banner

రాయల్ ఎన్ఫీల్డ్‌ను తలదన్నే ఉత్పత్తుల తయారీకి హోండా టూవీలర్స్... రాయల్ ఎన్ఫీల్డ్‌కు దడ

  Sun Mar 19, 2017 18:53        Auto, Telugu

హోండా మోటార్ సైకిల్స్ ఇండియాలో మిడిల్‌వెయిట్ మోటార్ సైకిళ్ల తయారీకి ప్రణాళికలు సిద్దం చేస్తోంది. రాయల్ ఎన్ఫీల్డ్‌ను తలదన్నే ఉత్పత్తుల తయారీకి ప్రత్యేక ఇంజనీర్ల బృందాన్ని ఏర్పాటు చేస్తోంది.

జపాన్‌ దిగ్గజ మోటార్ సైకిళ్ల తయారీ సంస్థ హోండా జపాన్ మరియు థాయిలాండ్ నుండి ఓ ఇంజనీర్ల బృందాన్ని తెప్పించి దేశీయంగా మిడిల్ వెయిట్ బైకుల అభివృద్ది, తయారీ మరియు ఎగుమతులకు రంగం సిద్దం చేస్తోంది.

ఆసియా హోండా మోటార్ కంపెనీ లిమిటెడ్ ప్రెసిడెంట్ మరియు సిఇఒ నొరియాకి అబె ఇచ్చిన ఓ ఇంటర్వూలో, హోండా మోటార్ సైకిల్స్ ఇండియాలో మిడిల్ వెయిట్ మోటార్ సైకిళ్ల తయారీకి సిద్దంగా ఉన్నట్లు తెలిపాడు.

ఏప్రిల్ 1, 2017 నుండి హోండా గ్లోబల్ మోటార్ సైకిల్ బిజినెస్ విభాగాధిపతిగా నొరియాకి అబె బాధ్యతలు తీసుకోనున్నారు. అబె మాట్లాడుతూ, ఇప్పటికే థాయిలాండ్ మరియు జపాన్ నుండి కొంత మంది ఇంజనీర్లను ఇండియాలో రీసెర్చ్‌కు పంపిన్నట్లు తెలిపాడు.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా జపిస్తున్న రాయల్ ఎన్ఫీల్డ్ ఉత్పత్తుల మీద ఆధిపత్యం సాధించే దిశగా హోండా యొక్క మొదటి ప్రయత్నం అని చెప్పవచ్చు. దేశీయంగా అభివద్ది మరియు తయారయ్యే ఈ మోటార్ సైకిళ్లను జపాన్ మార్కెట్‌కు ఎగుమతి చేయనున్నారు.

జపాన్ మార్కెట్లో 250సీసీ నుండి 400సీసీ సామర్థ్యం ఉన్న మోటార్ సైకిళ్లకు డిమాండ్ ఎప్పుడూ ఉంది, అయితే ధర మరియు ఇంజన్ సామర్థ్యం పరంగా జపాన్ మార్కెట్లో పోటీ ఎక్కువగా ఉన్న విషయాన్ని నొరియాకి అబె గుర్తుచేసారు.

రాయల్ ఎన్ఫీల్డ్ విషయానికి వస్తే, ఇండియన్ మార్కెట్లో ధృడమైన మార్కెట్‌ను ఏర్పరచుకుంది. భారీ సంఖ్యలో విక్రయాలు సాధిస్తున్న రాయల్ ఎన్ఫీల్డ్ అత్యధిక వృద్దిని నమోదు చేసుకుంటోంది.

ఏప్రిల్ 6 2016 నుండి ఫిబ్రవరి 2017 మధ్య కాలంలో ఐషర్ సంస్థ సుమారుగా 5,92,558 యూనిట్లను ఇండియాలో విక్రయించింది.   royal enfield, hoda motor cycle,